ఓటీటీ లవర్స్‎కు గుడ్ న్యూస్.. డైరెక్ట్ నెట్‌‌ఫ్లిక్స్‎లోనే 6 కొత్త సినిమాలు రిలీజ్

ఓటీటీ లవర్స్‎కు గుడ్ న్యూస్.. డైరెక్ట్ నెట్‌‌ఫ్లిక్స్‎లోనే 6 కొత్త సినిమాలు రిలీజ్

థియేటర్లలో విడుదలైన సినిమాలు కొన్ని రోజుల తర్వాత  ఓటీటీ ప్లాట్‌‌ఫామ్‌‌లోకి  వస్తాయి. ఇటీవల డైరెక్ట్ స్ట్రీమింగ్ చిత్రాలకు కూడా మంచి ఆదరణ దక్కుతోంది. తాజాగా నెట్‌‌ఫ్లిక్స్ సంస్థ  కొత్తగా ఆరు తెలుగు, తమిళ ఒరిజినల్స్‌‌ను అనౌన్స్‌‌ చేసింది. వీటిలో ఆనంద్ దేవరకొండ  హీరోగా నటిస్తున్న ‘తక్షకుడు’ చిత్రాన్ని  డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. దర్శకుడు వినోద్ అనంతోజు తెరకెక్కించిన ఈ  థ్రిల్లర్‌‌లో ఆనంద్  ఒక అంధుడి పాత్రలో కనిపిస్తాడు. 

తన గ్రామ ప్రజల మరణాలకు ప్రతీకారం తీర్చుకునే ప్రయాణంలో అతనికి కుక్క ఒకటి తోడుగా ఉంటుంది. ఈ చిత్రం త్వరలోనే నెట్‌‌ఫ్లిక్స్‌‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇక  రీసెంట్‌‌‌‌గా  పవన్ కళ్యాణ్‌‌తో ‘ఓజీ’ చిత్రంలో మెరిసిన  ప్రియాంక మోహనన్  లీడ్‌‌గా నటించిన ‘మేడ్ ఇన్ కొరియో’ కూడా త్వరలోనే నెట్‌‌ఫ్లిక్స్‌‌లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.  కొరియన్ చిత్రాలు, సిరీస్‌‌లకు ఫ్యాన్ అయిన ఓ అమ్మాయి కొరియా వెళ్లిన తర్వాత ఏం జరిగింది అనేదే ఈ మూవీ స్టోరీ.  

ఈ సినిమాకు ఆర్ఏ కార్తీక్ దర్శకత్వం వహించగా..  శ్రీనిధి సాగర్ నిర్మించారు.  ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రియాంక మోహనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది.   ‘స్క్విడ్ గేమ్’ ఫేమ్ పార్క్ హై-జిన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు దర్శకుడు బాలాజీ మోహన్ రూపొందించిన  మోడరన్ రొమాంటిక్ సిరీస్‌‌ ‘లవ్’ కూడా త్వరలోనే స్ట్రీమింగ్‌‌కు రానుందని అనౌన్స్ చేశారు. ఈ సిరీస్‌‌లో అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించారు.

 కెమిస్ట్రీ వర్సెస్   కంపాటిబిలిటీ అనే చర్చను ఇందులో సరదాగా చూపించనున్నారు.  ఇక  దర్శకుడు మిథున్ తెరకెక్కించిన  సైకలాజికల్ థ్రిల్లర్‌‌ ‘స్టీఫెన్’,   దర్శకుడు చారుకేశ్ శేఖర్ రూపొందించిన ‘లెగసీ’ కూడా త్వరలో నెట్‌‌ఫ్లిక్స్‌‌లో స్ట్రీమింగ్ కానున్నాయి.  

ఈ ఫ్యామిలీ గ్యాంగ్‌‌స్టర్ డ్రామాలో ఆర్. మాధవన్, నిమిషా సజయన్, గౌతమ్ కార్తిక్, గుల్షన్ దేవయ్య, అభిషేక్ బెనర్జీ ముఖ్య పాత్రలు పోషించారు.   థ్రిల్లర్లు, ఎమోషనల్ డ్రామాలు, కామెడీలు, ప్రేమ కథలు ..ఇలా  డిఫరెంట్ జానర్స్ ద్వారా తెలుగు, తమిళ  చిత్రసీమ క్రియేటివ్‌‌ని ప్రపంచానికి చూపిస్తుందని నెట్‌‌ఫ్లిక్స్‌‌ సంస్థ ప్రకటించింది.