
హన్సిక లీడ్ రోల్‌లో రాజు దుస్స దర్శకత్వంలో బొమ్మక శివ నిర్మించిన చిత్రం ‘105 మినిట్స్’. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. ఈ మూవీ మోషన్ పోస్టర్‌ను డైరెక్టర్ అజయ్ భూపతి రిలీజ్ చేసి టీమ్‌కు ఆల్ ద బెస్ట్ అని చెప్పారు. సింగిల్ షాట్ సింగిల్ క్యారెక్టర్ మూవీగా దీన్ని రూపొందించారు. అదృశ్య శక్తి నుంచి తనను తాను కాపాడుకునే అమ్మాయిగా హన్సిక బాగా నటించిందని, తనదైన హావభావాలతో అందర్నీ ఆకట్టుకుంటుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందించాడు. మాంక్, పనోరమ స్టూడియోస్ కలిసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.