సినిమా సెట్స్‌లో మహిళలకు 8 గంటల షిఫ్ట్, సమానత్వంపై స్పందించిన కాంతారా స్టార్ హీరో..

 సినిమా సెట్స్‌లో మహిళలకు 8 గంటల షిఫ్ట్, సమానత్వంపై స్పందించిన కాంతారా స్టార్ హీరో..

సినీ ఇండస్ట్రీలో మహిళలకు అనుకూలంగా, మద్దతు గురించి జరుగుతున్న చర్చలో భాగంగా, ముఖ్యంగా కొత్త తల్లులకు( new mothers) ఎనిమిది గంటల షిఫ్ట్‌ గురించి పరిశ్రమలో జరుగుతున్న చర్చపై మాట్లాడారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన 'కాంతార' దర్శకుడు తన సెట్‌లో పనితీరు, సానుభూతి, సమానత్వం ఎలా ఉంటాయో వివరించారు.

తన సెట్‌లలో ఎలాంటి వివక్ష లేకుండా నిర్ణయాలు తీసుకుంటామని, షూటింగ్ సమయంలో మహిళల అవసరాలు, డిమాండ్లు  తీర్చుతామని  రిషబ్ శెట్టి చెప్పారు. తన సొంత కుటుంబాన్ని ఉదాహరణ చూపిస్తూ "అలా ఏమీ లేదు. మేము 'కాంతార' సినిమా మొదలుపెట్టినప్పుడు నా భార్య ప్రగతి గర్భవతిగా ఉంది. మేము ఇంకా షూటింగ్‌లో ఉండగానే ఆమెకు డెలివరీ అయింది. దాదాపు 15-20 రోజులు బ్రేక్ తీసుకుని, ఆ తర్వాత షూటింగ్‌ను తిరిగి మొదలుపెట్టి సినిమా పూర్తి చేశాం. 'కాంతార చాప్టర్ 1'  మొదలుపెట్టే సమయానికి, మా పాపకు దాదాపు రెండేళ్లు" అని రిషబ్ శెట్టి చెప్పారు.

సెట్‌లో మహిళల అవసరాలను ఎప్పుడు పరిగణనలోకి తీసుకుంటామని, ఒకవేళ నటిగా ఎవరికైనా ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే, మేము తప్పకుండా అడ్జస్ట్ చేస్తాం. ఆ పాత్ర చేయాలా వద్దా లేదా ఆ సమయంలో చేయాలా వద్దా అనే విషయాలన్నీ కూడా మేము వారికి అనుకూలంగా సర్దుబాటు చేస్తాం" అని అన్నారు. లింగ భేదం లేకుండా కళాకారులందరి అవసరాలకు అనుగుణంగా టైం, షూటింగ్ షెడ్యూల్‌లు అడ్జస్ట్ చేస్తామని తెలిపారు. ముఖ్యంగా 'కాంతార' వంటి సినిమా కోసం ఎక్కువగా సహజమైన లొకేషన్లలో షూట్ చేసాం, కాబట్టి సహజ కాంతిలో షూటింగ్ చేయడం ఎంత కష్టమో రిషబ్ శెట్టి వివరించారు.

ఒకవేళ ఫుల్ టైం పని చేయాల్సిన వస్తే, మేము తెల్లవారుజామున 3 నుండి 4 గంటలకు లేచి, కాస్ట్ మొత్తాన్ని సెట్‌కి తీసుకువచ్చి, మేకప్ వేసి, ఉదయం 6 గంటలకు షాట్ తీసుకుంటాం. ఎందుకంటే మేము ఉదయం సూర్య కాంతి పడేటప్పుడు గోల్డ్ లైట్లో (Golden Light) షూట్ చేయాలి. ఆ విషయంలో రాజీ పడము అని అన్నారు. మధ్యలో ఎవరికైనా ఏ సమస్య వచ్చినా, వారికి బ్రేక్ ఇస్తాం. సెట్స్‌లో ఎప్పుడూ కారవాన్, అంబులెన్స్ ఉంటుంది. అది కూడా కచ్చితంగా ఉండేల చూసుకుంటాం అని చెప్పారు. 

ఈ సినిమా కథ రాసిన శెట్టి థియేటర్లలో 'కాంతార' చూసేటప్పుడు అభిమానులు దైవ వేషం వేయవద్దని కోరినట్లు కూడా చెప్పారు. ఈ సినిమా ఒక సినిమాటిక్ అనుభవం కోసం రూపొందించినప్పటికీ, కథలో చూపించిన కొన్ని అంశాలు అపహాస్యం చేయడానికి వీల్లేని విధంగా పవిత్రమైనవి అని చెప్పారు. 2022లో వచ్చిన ఈ  సినిమాకి ప్రీక్వెల్ అయిన 'కాంతార చాప్టర్ 1' ప్రస్తుతం భారీ అంచనాల మధ్య నడుస్తోంది. ఈ సినిమా ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్ల గ్రాస్‌ను దాటి, కన్నడ సినిమాకు కొత్త ప్రమాణాలను నెలకొల్పింది.