Atlee Priya Baby: డైరెక్టర్ అట్లీ ఇంట బేబీ నంబర్ 2.. క్రేజీ ఫోటోలతో శుభవార్త చెప్పిన దంపతులు..

Atlee Priya Baby: డైరెక్టర్ అట్లీ ఇంట బేబీ నంబర్ 2.. క్రేజీ ఫోటోలతో శుభవార్త చెప్పిన దంపతులు..

తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దంపతులు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ దంపతులు తమ రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇప్పటికే ఈ క్రేజీ కపుల్స్ కి 'మీర్' అనే ముద్దైన కుమారుడు ఉన్నాడు. మీర్ జనవరి 2023లో జన్మించగా.. ఇప్పుడు అతడు అన్నయ్య పాత్రలోకి అడుగుపెట్టబోతున్నాడు.

ఈ శుభవార్తను ప్రియ అట్లీ దంపతులు తమ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఫోటోలు ఎంతో ఆప్యాయత, ప్రశాంతత, కుటుంబసౌఖ్యం నిండినవిగా ఉండటంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అలాగే, ఈ ఫోటోలతో పాటుగా ఓ ఎమోషనల్ క్యాప్షన్తో అట్లీ దంపతులు ఆసక్తి పెంచారు. “మా ఇంట్లోకి మరో కొత్త సభ్యుడు రాబోతున్నాడు. అవును, మేము మళ్లీ మరొక బిడ్డకు జన్మనివ్వబోతున్నాము. మీ అందరి ఆశీర్వాదాలు, ప్రేమ, ప్రార్థనలు కావాలి” అని అట్లీ దంపతులు కోరారు. 

ఫోటోల ప్రత్యేక ఆకర్షణ.. 

అట్లీ, ప్రియ షేర్ చేసిన ఫోటోలు గమనిస్తే..“ అట్లీ, ప్రియ మరియు మీర్‌తో పాటుగా తమ పెంపుడు జంతువుల పేర్లను కూడా క్యాప్షన్‌లో పేర్కొనడం అభిమానులను మరింత ఆకట్టుకుంది. అలాగే, ఒక ఫోటోలో ప్రియ తన బేబీ బంప్‌ను సున్నితంగా పట్టుకుని, అట్లీ ఒడిలో సేద తీరే ఫోటో క్యూట్ నెస్ కలిగిస్తోంది. మరో ఫోటోలో కుమారుడు మీర్.. ప్రియా మాదిరిగా బేబీ బంప్ ను చూపిస్తున్న ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తానికి ఇది ఓ ఫ్యాన్సీ ఫోటోషూట్‌లా కాకుండా బ్యూటిఫుల్ ఫ్యామిలీ మూమెంట్ లా” అనిపిస్తుంది. ఫొటోస్  వైరల్ అయిన వెంటనే కామెంట్ సెక్షన్ శుభాకాంక్షలతో నిండిపోయింది.

సమంత రూత్ ప్రభు స్పందిస్తూ, “చాలా చాలా అందంగా ఉంది. అభినందనలు నా అందమైన మామా” అని రాసారు. కీర్తి సురేష్ విషెష్ చెబుతూ, “అభినందనలు నా డార్లింగ్స్… నైకీ, కెనీ తరఫున కూడా ఎంతో ప్రేమ” అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు తమ ఫ్యాన్స్ కూడా.. విషెష్ చెబుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. అందులో ఓ నెటిజన్ స్పందిస్తూ.. “చాలా అందమైన ప్రకటన.. అభినందనలు” అని తెలుపగా.. మరోవైపు, “ఇది నిజంగా ఓ మధురమైన పోస్ట్.. మీ కుటుంబానికి మరింత ఆనందం కలగాలి ” అంటూ ప్రేమను కురిపించారు.

అట్లీ – ప్రియ దంపతుల ప్రయాణం

అట్లీ మరియు ప్రియ 2014లో వివాహం చేసుకున్నారు. సినిమా పరిశ్రమకు చెందిన సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య సంప్రదాయబద్ధంగా వారి వివాహం జరిగింది. ఎనిమిదేళ్ల దాంపత్య జీవితం తర్వాత 2023లో మీర్ జన్మించాడు. ఇప్పుడు రెండో బిడ్డతో వారి కుటుంబం మరింత సంపూర్ణం కానుంది.

అల్లు అర్జున్, అట్లీ మూవీ:

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్ బస్టర్ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'AA22xA6' (వర్కింగ్ టైటిల్).  బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో ' జవాన్ ' చిత్రాన్ని నిర్మించి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల మార్కును అందుకున్నారు అట్లీ. ఇప్పుడు బన్నీతో కలిసి మరో భారీ విజువల్ వండర్ ను ప్లాన్ చేస్తున్నారు.

దర్శకుడు అట్లీ ఈ సినిమాను ఒక 'పారలల్ యూనివర్స్' (Parallel Universe) కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్నారని టాక్. హాలీవుడ్ స్థాయి విజువల్స్ కోసం మేకర్స్ ఏకంగా రూ.350 నుండి రూ.400 కోట్లు కేవలం వీఎఫ్ఎక్స్ (VFX) కోసమే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం అంతర్జాతీయ స్టూడియోలతో అట్లీ ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం బడ్జెట్ రూ.600 నుంచి రూ.700 కోట్లు దాటే అవకాశం ఉంది. ఈ మూవీ బడ్జెట్ విషయంలో మేకర్స్ ఎక్కడా రాజీపడటం లేదు అంటున్నాయి సినీ వర్గాలు.