
‘బాహుబలి’కి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన పళని కె డైరెక్ట్ చేసిన లేటెస్ట్ ఫిల్మ్ ‘వన్ బై ఫోర్’ (One/4). యాక్షన్ క్రైమ్ డ్రామా జోనర్లో తెరకెక్కిన ఈ సినిమాని రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్ సంయుక్తంగా నిర్మించారు. వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్ మరియు హీనా సోని హీరో, హీరోయిన్స్గా నటిస్తున్నారు. టెంపర్ వంశీ, RX100 కరణ్ విలన్స్గా కనిపిస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ రిలీజ్‌కి సిద్ధమైనట్లు నిర్మాతలు వెల్లడించారు. అన్నీ కుదిరితే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబరులో థియేటర్లలోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘వన్ బై ఫోర్’(one/4)ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం. షూటింగ్ మొత్తం వైజాగ్లో జరిగింది. నోరు జారితే జరిగే పరిణామాలు వాటివల్ల వచ్చే సమస్యలు ఎలా ఉంటాయో చెప్పే కథే మా వన్ బై ఫోర్ (one/4).
సినిమా చాలా కొత్తగా ఫ్రెష్గా ఉంటుంది. మంచి థ్రిల్లింగ్ కథతో అద్భుతమైన క్రైమ్ యాక్షన్ సన్నివేశాలతో రూపొందించాం. ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. టి సిరీస్ యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయని మేకర్స్’తెలిపారు. ఈ సినిమాకు సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్నారు.