రామ్ చరణ్ బెస్ట్.. ఎన్టీఆర్తో మూవీ చేసేంత టాలెంట్ నాకు లేదు: తేజ

రామ్ చరణ్ బెస్ట్.. ఎన్టీఆర్తో మూవీ చేసేంత టాలెంట్ నాకు లేదు: తేజ

టాలీవుడ్ డైరెక్టర్ తేజ ఆర్ఆర్ఆర్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ పై ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసాడు. ప్రస్తుతం ఆయన రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా అహింస అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు మూవీ టీం. ఇందులో భాగంగానే వరుస ఇంటర్వూలు ఇస్తున్నారు. తాజాగా డైరెక్టర్ తేజ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో ఆయన RRR సినిమా, రామ్ చరణ్, ఎన్టీఆర్ పై ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 

ఇంటర్వ్యూలో యాంకర్ ప్రస్తుతం మీ ఫేవరేట్ హీరో ఎవరు? దానికి సమాధానంగా తేజ..  "ఇప్పుడు ఉన్న జెనరేషన్ లో నాకు యాక్టర్ గా రామ్ చరణ్ బాగా నచ్చాడు. రంగస్థలంలో తన నటన చూసినప్పుడు నుంచి అతనంటే ఇష్టం ఏర్పడింది. ఆ సినిమాలో చరణ్ నటన, మ్యానరిజంలు బాగా చేసాడని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇక ఎన్టీఆర్తో సినిమా చేయాలి అంటే ఎలాంటి సినిమా చేస్తారు అని అడగగా.. "ఎన్టీఆర్ తో సినిమా చేసేంత టాలెంట్ నాకు లేదంటూ" ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ప్రస్తతం తేజ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.