స్టార్ ప్రభాస్తో డైరెక్టర్ హనురాఘవపుడి? ఆర్మీ బ్యాక్ డ్రాప్లో లవ్ స్టోరీ రెడీ!

 స్టార్ ప్రభాస్తో డైరెక్టర్ హనురాఘవపుడి? ఆర్మీ బ్యాక్ డ్రాప్లో లవ్ స్టోరీ రెడీ!

డైరెక్టర్ హనురాఘవపుడి(Hanuraghavapudi)  బెస్ట్ స్టోరీ టెల్లర్గా టాలీవుడ్ లో రాణిస్తున్నారు. అందాల రాక్షసి మూవీతో ఇంటెన్స్ లవ్ స్టోరీ తీసిన హను..రీసెంట్గా సీతారామం  వరకు అంతే ఇంటెన్సిటీ లవ్ ఎమోషన్ను తన మూవీస్లో క్యారీ చేస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) తో హను రాఘవపూడి అదిరిపోయే కాన్సెప్ట్ను రెడీ చేశారని సమాచారం. 

ఈ స్టోరీ ఆర్మీ బ్యాక్ డ్రాప్లో ఉండే ఇంటెన్స్ ఎమోషన్ లవ్ స్టోరీ అని టాక్ వినిపిస్తోంది. దిల్ రాజ్ బ్యానర్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు టాక్.  అలాగే దసరా స్పెషల్గా ఈ మూవీకి సంబంధించి ఆఫీసియల్ అనౌన్స్ మెంట్ వెలువడే అవకాశం ఉంది. వీరిద్దరి ప్రాజెక్ట్ కన్ఫర్మ్ కాకపోయినప్పటికీ  హను ఫ్యాన్స్..ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. 
 
హను రాఘవపూడి..సీతారామం మూవీని ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించగా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఈ మూవీలో యాక్ట్ చేసిన దుల్కర్.. మృణాల్ ఠాకూర్ క్రేజీ అమాంతం పెరిగిపోయింది. దీంతో మృణాల్ వరుస ఆఫర్స్తో బిజీ హీరోయిన్ గా మారింది. ఇక ప్రభాస్ తో  చేయబోయే ఈ చిత్రం ఎలాంటి కాన్సెప్ట్స్ తో రానుందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. 

 ప్రసెంట్ ప్రభాస్ వరుస మూవీస్ తో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ తో సలార్ పార్ట్ 1, నాగ్ అశ్విన్ తో కల్కి. ఇక మరోపక్క మారుతి, సందీప్ వంగా మూవీస్ను లైన్ లో పెట్టేశారు ప్రభాస్. ఇక హను రాఘవపూడి మూవీ రిలీజ్ కావడానికి కనీసం రెండేళ్లు పట్టే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో హను రాఘవపూడి వెయిట్ చేస్తాడో..లేక అంతలోపు వేరే మూవీని డైరెక్ట్ చేస్తాడో చూడాలి మరి.