టాలీవుడ్లో మరో మాస్ కాంబో.. త్వరలోనే బాలయ్యతో హరీష్ మూవీ

టాలీవుడ్లో మరో మాస్ కాంబో.. త్వరలోనే బాలయ్యతో హరీష్  మూవీ

టాలీవుడ్ లో మరో మాస్ కాంబో సెట్ అయిందా? అంటే అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. నందమూరి బాలకృష(Balakrishna), మాస్ అండ్ స్టైలీష్ డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) కాంబోలో ఓ సినిమా రానుందంట. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

నిజానికి ఈ కాంబో కోసం నందమూరి ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. హరీష్ శంకర్, ఎన్టీఆర్ కాంబోలో గతంలో రామయ్య వస్తావయ్యా అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. కానీ, సినిమాలో ఎన్టీఆర్ నటనకు, లుక్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్టీఆర్ ను సరికొత్తగా ప్రెజెంట్ చేసినందుకు హరీష్ శంకర్ ను చాలా ఇష్టపడతారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.  ఇక అప్పటినుండి బాలకృష్ణతో కూడా హరీష్ శంకర్ ఒక సినిమా చేయాలని భావించారు నందమూరి ఫ్యాన్స్.  కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. 

చాలా గ్యాప్ తరువాత ఈ కాంబో సెట్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కు సంబంధించి కథ చర్చలు కూడా ముగిశాయని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ప్రస్తుతం రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నే  హరీష్, బాలయ్య సినిమాను కూడా తెరకెక్కించనున్నారని టాక్. మిస్టర్ బచ్చన్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు పూర్తవగానే బాలయ్య సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. మరి క్రేజీ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తుందో చూడాలి.