శ్రీవిష్ణు హీరోగా జానకిరామ్ మారెళ్ల తెరకెక్కించిన చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. మహిమా నంబియార్ హీరోయిన్. ఈనెల 9న సినిమా రిలీజ్ సందర్భంగా దర్శకుడు జానకిరామ్ మాట్లాడుతూ ‘ఒరిస్సా- – ఆంధ్ర బోర్డర్‌లో జరిగే కథ ఇది. చక్కని ఎంటర్‌టైనర్. టైటిల్ కథ నుంచే వచ్చింది. శ్రీవిష్ణు గారి ప్రధాన బలం వినోదం. ఇందులో అది స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఒక సమస్యలో ఉన్న వ్యక్తి నక్సలిజం వైపు వెళ్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేది ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. కథ ప్రకారం డీప్ ఫారెస్ట్‌లో షూటింగ్ చేయాల్సి ఉంది. అందుకే మంగళూరు దగ్గర ఆగుంబె ఫారెస్ట్‌కి వెళ్లాం.
ప్రపంచంలోనే ఎక్కువ కోబ్రాలు ఉండే అడవి అది. తొలిరోజే పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నా. చాలా రిస్క్ చేసి షూటింగ్ చేశాం. ప్రేక్షకులు ఏ జానర్ సినిమానైనా వాస్తవికతకు దగ్గరగా చూడటానికి ఇష్టపడుతున్నారు. అందుకే ప్రేక్షకులకు మంచి వినోదం ఇవ్వడానికే ఇంత రిస్క్ తీసుకున్నాం. నిర్మాతలతో పాటు హీరో శ్రీవిష్ణు చాలా సపోర్ట్ చేశారు.
ఆయన కథను, నన్ను నమ్మారు. ఒక షాట్ కోసం మూడు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేశాం. తన క్యారెక్టర్‌ను ఫుల్ ఫన్‌గా రాశాం. ఆయన ఇంకా ఇంప్రువైజ్ చేశారు. మా కామ్రేడ్ అందరినీ నవ్విస్తాడు. మహిమా నంబియార్, రాధిక గారు, సత్య సహా అన్ని పాత్రలు ఆకట్టుకుంటాయి’’ అని చెప్పాడు.
