
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఇప్పటికీ షూటింగ్ దశలో ఉన్న కల్కి మూవీతో పాటు మారుతి డైరెక్షన్ లో ఒకటి, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ తో స్పిరిట్, ప్రశాంత్ నీల్ సలార్ మూవీస్ చేస్తోన్న విషయం తెలిసేందే. ప్రభాస్ వీటితో పాటు మరిన్ని కొత్త కథలకు సైన్ చేస్తున్నారని తెలుస్తోంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..ప్రభాస్ తో మైత్రీ మూవీ మేకర్స్ ఓ భారీ ప్రాజెక్ట్ ను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అందుకు గాను ఓ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో కథ చర్చలు పూర్తీ అయినట్లు ఇండస్ట్రీ టాక్. విక్రమ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj,)తో..ప్రభాస్ మూవీను సెట్ చేసినట్లు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతుంది.
కాగా ఇప్పటికే డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. రజినీకాంత్, సూర్య, విజయ్ వంటి స్టార్లతో లోకేష్ యూనివర్స్ గా మూవీస్ తీస్తున్న విషయం తెలిసేందే. మరి లోకేష్ యూనివర్స్ లో ప్రభాస్ ను భాగం చేస్తాడో..లేక మరో యూనివర్స్ ను స్టార్ట్ చేస్తాడో అని సస్పెన్స్ స్టార్ట్ అయింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ తెలుపుతున్నారు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ స్టైల్, మేకింగ్ లో అద్దిరిపోయే విజన్ కలిగి ఉన్నట్లు నిరూపించుకున్నారు.
ముందుగా మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) ప్రొడ్యూసర్స్ బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంతో కూడా కొన్ని కథలపై చర్చలు జరిపారు. కానీ మళ్ళీ ఎందుకో ఆ కాంబినేషన్ పై క్లారిటీ ఇంత వరకు అప్డేట్ లేదు. ఇక ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ సిద్దార్థ్ కోసం వెయిట్ చేయకుండా.. టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. ఏదీ ఏమైనా స్టార్ ప్రభాస్..లోకేష్ కాంబో సెట్ అయితే కనుక..మరో కొత్త యూనివర్స్ క్రియేట్ అవ్వడం కన్ఫర్మ్ అంటున్నారు సినీ క్రిటిక్స్.