‘రాజా సాబ్’ రిజల్ట్‌తో తామంతా హ్యాపీగా ఉన్నామని మేకర్స్ చెప్పారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ మూవీ శుక్రవారం విడుదలై తొలిరోజే రూ.112 కోట్ల రూపాయలు వసూళ్లు చేసిందని అన్నారు. ఈ సందర్భంగా కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ పేరుతో టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. దర్శకుడు మారుతి మాట్లాడుతూ ‘మిడ్ రేంజ్ డైరెక్టర్ అయిన నాకు ఈ అవకాశం కల్పించిన ప్రభాస్ గారికి జన్మంతా రుణపడి ఉంటాను. అయితే ఇలాంటి మైండ్ గేమ్ ప్రేక్షకులకు రీచ్ అయ్యేందుకు కొంత టైమ్ తీసుకుంటుంది. మేము చెప్పాలనుకున్న పాయింట్‌పై ఇంటలెక్చువల్స్ ఒకలా మాట్లాడుతున్నారు. అర్థం కాని వాళ్లు తిడుతున్నారు.
రకరకాల రెస్పాన్స్‌లు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో అప్పుడే సినిమా ఫలితాన్ని డిసైడ్ చేయొద్దు. ఇక ఫ్యాన్స్ సూచన మేరకు ట్రైలర్‌లో చూపించిన ప్రభాస్ గారి ఓల్డ్ గెటప్ సీన్స్‌ను యాడ్ చేశాం. 8 నిమిషాల ఆ ఫైట్‌లో ప్రభాస్ గారి స్వాగ్, స్టైల్‌ను ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పాడు. సినిమాకు దక్కుతున్న ఆదరణ చూస్తుంటే సంతోషంగా ఉందని హీరోయిన్స్ మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ అన్నారు.
నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ ‘ఈ మూవీ సక్సెస్‌తో హ్యాపీగా ఉన్నాం. తొలి రోజు రూ.100 కోట్ల రూపాయలు వరల్డ్‌వైడ్‌గా కలెక్ట్ చేస్తుందని ఆశించాం. మా అంచనాలు మించి రూ.112 కోట్ల రూపాయలు వసూళ్లు దక్కాయి. గ్లోబల్‌గా కలెక్షన్స్ డీటెయిల్స్ వస్తున్నాయి. ఆ నెంబర్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తాం’ అని చెప్పారు.
