స్టార్, ఫ్యాన్ రిలేషన్‌‌‌‌తో ఆంధ్ర కింగ్ తాలుకా

స్టార్, ఫ్యాన్ రిలేషన్‌‌‌‌తో ఆంధ్ర కింగ్ తాలుకా

ఒక  ఫ్యాన్ బయోపిక్‌‌‌‌గా  ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ చిత్రాన్ని  రూపొందించినట్టు దర్శకుడు పి.మహేష్ బాబు చెప్పాడు. రామ్, భాగ్యశ్రీ బోర్సే జంటగా ఉపేంద్ర కీలక పాత్రలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ నవంబర్ 27న విడుదలవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్  పి.మహేష్ బాబు మాట్లాడుతూ ‘సౌత్ ఇండియాలో హీరోస్‌‌‌‌ని  మన జీవితంలో ఒక అంతర్భాగంగా చూస్తాం. అందులో నాకు చాలా ఎమోషన్స్ కనిపించాయి. 

అలా ఆ ఇద్దరి రిలేషన్‌‌‌‌తో ఒక కథ  చెప్పొచ్చు అనిపించింది.  ఫ్యాన్‌‌‌‌ బేస్‌‌‌‌తో  కొన్ని సినిమాలు  వచ్చాయి కానీ ఇలాంటి కథతో  ఇప్పటివరకు సినిమా రాలేదు.  ఇందులో నేను చెబుతున్న కథ కంప్లీట్ డిఫరెంట్, చాలా యూనిక్. ఇది 2002లో జరిగే స్టోరీ.  అప్పుడు రెండు రాష్ట్రాలు కలిసి ఉండేవి  కాబట్టి ఈ చిత్రానికి ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ అనే టైటిల్ పెట్టాం.  రామ్ గారు ఈ కథకు బాగా కనెక్ట్ అయ్యారు.  ఆయన క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో, పెర్ఫార్మెన్స్‌‌‌‌లో చాలా ఎనర్జీ ఉంటుంది . ఒక ఫ్యాన్ ఎలా బిహేవ్ చేస్తాడో ఎంత మాస్‌‌‌‌గా ఉంటాడో అలాంటి పెర్ఫార్మెన్ ఇచ్చారు.   సూర్య అనే పాత్రలో ఉపేంద్ర గారు నటించారు. ఆ పాత్రలో స్టార్స్ అంతా కనిపిస్తారు. మనం అభిమానించే వ్యక్తి నుంచి  ఏం నేర్చుకుంటున్నామనే  ఒక మెసేజ్‌‌‌‌లా ఈ చిత్రం ఉంటుంది. భాగ్యశ్రీ  సహా ప్రతి క్యారెక్టర్ ఒక ఎమోషన్‌‌‌‌తో ఉంటుంది’ అని చెప్పాడు.