హనుమాన్ ప్రమోషన్స్ షురూ.. ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది గురు

హనుమాన్ ప్రమోషన్స్ షురూ.. ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది గురు

టాలీవుడ్ టాలెంటెడ్ అండ్ క్రియేటీవ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth varma) నుండి వస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ హనుమాన్ (Hanuman). యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) హీరోగా వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీపై ఇప్పటికే భారీ అంచనాలన్నాయి. అందుకే ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. 

వాస్తవానికి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీ అనౌన్స్ చేసినప్పుడు..సినిమా మీద ఏ అంచనాలు లేవు. ఫస్ట్ టీజర్ రిలీజ్ చేయగానే అమాంతం అంచనాలన్నీ పెరిగిపోయాయి. మొదట తెలుగు లో ఓ రేంజ్ సినిమా అనుకున్న హనుమాన్ మూవీ..ఇప్పుడు పాన్ ఇండియా సర్కిల్లో టాక్ అఫ్ ది రికార్డ్గా మారింది.

ఈ సినిమా నుంచి బయటికొచ్చే పోస్టర్స్..వినిపించే న్యూస్..ఇలా ఒక్కొక్కటీ ఇంట్రెస్ట్ పెంచుతూ వస్తున్నాయి.దీంతో ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ మేకర్స్ ఫిక్స్ అయ్యారు కూడా. ఇప్పుడు  సంక్రాంతికి  తెలుగులో భారీ ఎత్తున సినిమాలు వస్తుండటంతో..వెనక్కి తగ్గాలని మేకర్స్ భావించిన..అది ఎటూ డిసైడ్ చేసుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికీ బాలీవుడ్ లో రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో, సంక్రాంతికే డేట్ను లాక్ చేసారు. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో జోరు పెంచాలని డిసైడ్ అయ్యారు. 

ఈ నెల నవంబర్14న ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. ఇక సాంగ్తో పాటుగా చిన్న కామిక్ బుక్ కూడా విడుదల చేస్తున్నారు. అలాగే వచ్చే నెల (డిసెంబర్ 1న) ట్రయిలర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీపై ఏర్పడ్డ బజ్..పెద్ద ఎత్తున ఉండటంతో సినిమా రిలీజ్ అయ్యేలోపు..ఒక ట్రయిలర్ అని కాకుండా..వీలైతే రెండు లేదా అంతకు మించి ట్రైలర్స్ని  రిలీజ్ చేయాలని అన్నది..డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆలోచన. 

Also read :- లాల్ సలామ్ మూవీ హార్డ్డిస్క్లు మాయం.. రికవరీ చేయడం సాధ్యమేనా?

అంతేకాకుండా..విజువల్స్ నెక్స్ట్ లెవల్లో ఉండాలని..చాలా టైం తీసుకున్న మేకర్స్. ట్రైలర్ తోనే సినిమా స్ట్రాటజీ ఏంటనేది చూపించబోతున్నారు. ఈ మూవీ రిలీజ్కు సరిగ్గా రెండు నెలలే టైమ్ ఉండటంతో..పాన్ ఇండియా వైడ్గా పబ్లిసిటీకి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

హనుమాన్ సినిమా 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా 11 భాషల్లో రిలీజ్ కానుంది. మరి చాలా హై రేంజ్ ఎక్స్పెక్ట్షన్స్ తో వస్తున్న హనుమాన్ మూవీ..బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయనుందో తేలియాలంటే..2024 జనవరి వరకు ఆగాల్సిందే.