లాల్ సలామ్ మూవీ హార్డ్డిస్క్లు మాయం.. రికవరీ చేయడం సాధ్యమేనా?

లాల్ సలామ్ మూవీ హార్డ్డిస్క్లు మాయం.. రికవరీ చేయడం సాధ్యమేనా?

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) స్పెషల్ రోల్ చేస్తున్న లేటెస్ట్ మూవీ లాల్ సలామ్(Lal Salaam). ఆయన కూతురు ఐశ్వర్య (Aishwarya) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విష్ణు విశాల్‌(Vishnu Vishal), విక్రాంత్‌ సంతోష్‌(Vikramnth santhosh) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. క్రికెట్ గేమ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. 

తాజాగా ఈ సినిమా గురించి ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో రజినీకాంత్ సీన్స్ కు సంబందించిన హార్డ్డిస్క్లు మాయమయ్యాయట. ఇటీవల ఎడిటింగ్ సమయంలో ఆ ఫుటేజ్ కోసం చెక్ చేయగా కనిపించలేదట. దీంతో మూవీ టీమ్ ఆలోచనలో పడ్డారట. ఎంతో కష్టపడి తెరకెక్కించిన ఆ ఫుటేజ్ కనిపించకపోవడంతో ఆందోళన చెందుతున్నారట. మిస్ అయినా ఫుటేజ్ ను రికవరీ చేసేందుకు విదేశాల నుండి నిపుణులను రప్పిస్తున్నారని సమాచారం. దీంతో 2024 సంక్రాంతికి రావాల్సింన ఈ సినిమా పోస్ట్ పోన్ కానుంది. మరి ఆ డాటా రికవరీ అవుతుందా? మళ్ళీ చిత్రీకరించాల్సిందేనా అనేది తెలియల్సి ఉంది.

Also Read :- గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసిన సుమ తాతయ్య.. ఎందుకో తెలుసా?