గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసిన సుమ తాతయ్య.. ఎందుకో తెలుసా?

గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసిన సుమ తాతయ్య.. ఎందుకో తెలుసా?

యాంకర్ సుమ(Anchor Suma).. మలయాళీ అమ్మాయిగా తెలుగులో సీరియల్స్ తో ఎంట్రీ ఇచ్చిన సుమ.. ఆతరువాత యాంకర్ గా మంచి గుర్తింపుతెచ్చుకున్నారు. దాదాపు 20 ఏళ్లుగా ఆమె తన యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకులని అలరిస్తున్నారు. అది టీవీ షో అయినా, సినిమా ఈవెంట్ అయినా, సెలబ్రెటీ ఇంటర్వ్యూ అయినా.. సుమ ఉండాల్సిందే. సోషల్ మీడియాలో కూడా సూపర్ ఆక్టివ్ గా ఉండే సుమ.. అప్పుడప్పుడు తన కుటుంబ విషయాలను కూడా ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె తాతయ్య గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్నీ అభిమానులతో పంచుకున్నారు. 

సుమ అమ్మమ్మ గారి సోదరుడు పి బాలసుబ్రమణ్యన్ మీనన్ అరుదైన గౌరవం దక్కింది. 98 ఏళ్ళ ఆయన వృత్తిరీత్యా ఒక అడ్వకేట్. దాదాపు 73 ఏళ్ళగా ఈయన ఈ ప్రొఫెషన్ లో ఉన్నారు. లాయర్ వృత్తిలో 73 సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఏకైక లాయర్ గా బాలసుబ్రమణ్యన్ మీనన్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఇదే  విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులంతో పంచుకున్నారు సుమ.