విజయ్ సేతుపతి, త్రిష ‘96’ సినిమా మస్తు నచ్చిందా..? అయితే మీకో గుడ్ న్యూస్..!

విజయ్ సేతుపతి, త్రిష ‘96’ సినిమా మస్తు నచ్చిందా..? అయితే మీకో గుడ్ న్యూస్..!

తమిళ్ లో ప్రముఖ హీరో విజయ్ సేతుపతి మరియు స్టార్ హీరోయిన్ త్రిష జంటగా నటించిన 96 సినిమా మంచి హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాకి  తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించగా ప్రముఖ సినీ నిర్మాత ఎస్, నందకుమార్ నిర్మాతగా వ్యవహరించారు. అయితే 18 కోట్ల రుపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన 96 సినిమా బాక్సాఫిస్ మంచి విజయం సాధించడంతోపాటు దాదాపుగా రూ. 50 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. అంతేకాదు ఈ చిత్రాన్ని తెలుగులో కూడా జానూ పేరుతో రీమేక్ చేశారు. 

అయితే తాజాగా దర్శకుడు ప్రేమ్ కుమార్ 96 సినిమా సీక్వెల్ పై స్పందించాడు. ఇందులో భాగంగా 96 సినిమా సీక్వెల్ కి సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపాడు. అలాగే  96 చిత్రంలో హీరో హీరోయిన్ గా నటించిన విజయ్  సేతుపతి మరియు త్రిష ప్రస్తుతం తమకి సంబందించిన ఇతర చిత్రాల షూటింగులతో బిజీగా ఉన్నారని దీంతో వారి డేట్స్ కుదరగానే మరింత సమాచారం అందిస్తామని ప్రేమ్ కుమార్ చెప్పుకొచ్చాడు . 

Also Read :- దేవర పార్ట్ -1 రన్ టైంపై ఇంట్రస్టింగ్ అప్డేట్

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ప్రేమ్ కుమార్ తమిళంలో  మేయల‌గ‌న్ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో తమిళ ప్రముఖ హీరోలైన కార్తీ, అరవింద్ స్వామి హీరోలుగా నటించారు. కాగా ఈ చిత్రాన్ని తెలుగులో కూడా "సత్యం సుందరం" టైటిల్ తో ఈ నెల 27వ తారీఖున విడుదల చేస్తున్నారు.