ఆ పాట గుర్తుకొస్తే.. ఎక్కడ లేని ధైర్యం వస్తుంది

ఆ పాట గుర్తుకొస్తే.. ఎక్కడ లేని ధైర్యం వస్తుంది

సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతితో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. ప్రధాని మోడీతో పాటు, పలువురు రాజకీయ,సినీ ప్రముఖులు సిరివెన్నెల మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్నజ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. దర్శకధీరుడు రాజమౌళి సిరివెన్నెలతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. తాము కష్టాల్లో ఉన్నప్పుడు సిరివెన్నెల రాసిన ‘ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి..ఎప్పుడు వదులు కోవద్దురా ఓరిమి అన్న పదాలు గుర్తుతెచ్చుకుంటే...ఎక్కడ లేని ధైర్యం వచ్చేదన్నారు. RRR లో దోస్తీ మ్యూజిక్ వీడియోకి లిరిక్ పేపర్లో సిరివెన్నెల సంతకం చేసే షాట్ తీద్దామనుకున్నామన్నారు. కానీ అప్పటికే సిరివెన్నెల ఆరోగ్యం సహకరించక కుదర్లేదన్నారు రాజమౌళి.