అఖిల్ స్క్రిప్ట్‌పై రాజమౌళి ఫోకస్..డైరెక్టర్ ఎవరంటే?

అఖిల్ స్క్రిప్ట్‌పై రాజమౌళి ఫోకస్..డైరెక్టర్ ఎవరంటే?

ఏజెంట్(Agent) సినిమా భారీ డిజాస్టర్ తో రేసులో వెనుకబడిపోయాడు అక్కినేని యంగ్ హీరో అఖిల్(Akkineni Akhil). సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వంలో వచ్చిన ఈ స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దీంతో ఈ సినిమాకు దాదాపు రూ.80 కోట్ల భారీ నష్టం వచ్చిందని అంచనా. ఇక ఈ సినిమా తరువాత అఖిల్ నుండి ఎలాంటి సినిమా రానుంది? ఏ దర్శకుడితో వర్క్ చేయనున్నాడు అనేది ఇపుడు ఆసక్తికరంగా మారింది. 

అఖిల్ నుంచి రాబోయే అఖిల్6 చిత్రాన్ని కూడా యూవీ క్రియేషన్స్ బ్యానరే నిర్మిస్తుంది.ఈ మూవీకి అనిల్​కుమార్(Anil Kumar) అనే కొత్త డైరెక్టర్ వర్క్ చేస్తున్నాడట. ప్రభాస్ హీరోగా వచ్చిన సాహో మూవీకి సుజీత్ దగ్గర అసిస్టెంట్ గా చేసిన..అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడు చెప్పిన స్టోరీ అఖిల్ కి బాగా నచ్చిందట. 

త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా కూడా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని టాక్. కెరీర్ స్టార్టింగ్ నుండి ఒక సాలిడ్ కమర్షియల్ హిట్ కోసం చూస్తున్న అఖిల్ కి ఈ సినిమాతోనైనా ఆ కోరిక తీరుతుందా అనేది చూడాలి మరి.

Also Read :- క్రైం థ్రిల్లర్ తో గాడ్ మూవీ..పిల్లలు భయపడే అవకాశం ఉంది

అంతేకాకుండా ఈ మూవీ స్క్రిప్ట్‌పై దర్శకదీరుడు రాజమౌళి(Rajamouli) ఫోకస్ పెట్టారని సినీ సర్కిల్స్‌లో టాక్. హీరో అఖిల్, రాజామౌళి కుమారుడు కార్తికేయచిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ కావడం వల్ల..ఈ సినిమా విషయంలో జక్కన హెల్ప్ చేయడానికి రెడీ అయ్యాడని టాక్. అలాగే డైరెక్టర్ అనిల్ కూడా కార్తీకేయ కి ఫ్రెండ్ అని తెలుస్తోంది. దీంతో జక్కన్న ఈ స్క్రిప్ట్ ని చెక్కే పనిలో ఉన్నాడట. ఇక ఈ స్క్రిప్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అఖిల్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుందని టాక్.