మేల్ ఫెర్టిలిటీ ఇష్యూపై సినిమా.. ఇప్పటిదాకా నాలుగు గోడల మధ్యనే ఆ డిస్కషన్.. ఇకపై మాత్రం!!

మేల్ ఫెర్టిలిటీ ఇష్యూపై సినిమా.. ఇప్పటిదాకా నాలుగు గోడల మధ్యనే ఆ డిస్కషన్.. ఇకపై మాత్రం!!

ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్ మెంట్, ఎమోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు మంచి మెసేజ్ ఉన్న  చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’ అని  డైరెక్టర్ సంజీవ్ రెడ్డి అన్నాడు.  విక్రాంత్, చాందిని చౌదరి జంటగా  మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 14న విడుదల కానుంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ ‘ఫెర్టిలిటీ ఇష్యూస్ మీద  కొన్ని చిత్రాలు వచ్చినా..  మేల్  ఫెర్టిలిటీ  నేపథ్యంగా  తెలుగులో సినిమా రాలేదు. నేను, రైటర్ కల్యాణ్ రాఘవ్ ఈ స్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఫ్యామిలీ మెంబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి చూసేలా డిజైన్ చేశాం.

ఇష్యూపై ఉన్న రెస్పెక్ట్, కథను చెప్పే విధానంలో డిగ్నిటీతోనే వెళ్లాం తప్ప ఆ సమస్యను ఎక్కడా ఫన్ చేయలేదు. దాన్ని ఎదుర్కొనే సందర్భాల్లో మాత్రం ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ క్రియేట్ చేశాం. ఎక్కడా హద్దు దాటకుండా మేల్ ఫెర్టిలిటీ ఇష్యూను హ్యూమరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చెప్పాం. సమస్యపై అవగాహన కల్పిస్తూనే చిన్న మెసేజ్ కూడా ఇస్తున్నాం. ఇలాంటి ఇష్యూను చెప్పడం నటిగా తన బాధ్యతగా భావించింది చాందిని చౌదరి.

విక్రాంత్ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. తరుణ్ భాస్కర్ నటుడిగా తన పాత్రను వీలైనంత ఇంప్రూవ్ చేసి నటించారు. షేక్ దావూద్ మా మూవీకి చక్కని కథనాన్ని అందించారు. ఇప్పటిదాకా నాలుగు గోడల మధ్యనే మాట్లాడుకునే అంశాన్ని ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా డిస్కస్ చేస్తారని అనుకుంటున్నాం. ఆ మార్పు తెచ్చేందుకు మొదటి అడుగు మా సినిమా అవుతుందని ఆశిస్తున్నాం’ అని చెప్పాడు.