ఇండియన్ 2 టీజర్ అప్డేట్.. డేట్ అనౌన్స్ చేసిన శంకర్

ఇండియన్ 2 టీజర్ అప్డేట్.. డేట్ అనౌన్స్ చేసిన శంకర్

ప్రస్తుతం ఇండియన్ సినీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీస్ లలో స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కిస్తున్న ఇండియన్2(Indian2) ఒకటి. లోకనాయకుడు కమల్ హాసన్(kamal haasan) హీరోగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. కారణం 1996 లో వచ్చిన సూపర్ హిట్ మూవీ భారతీయుడు(Bharateeyudu) సినిమాకు సీక్వెల్ కావడమే. అందుకే ఈ సినిమా కోసం ఆడియన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ గా మారుతోంది. 

Also Read ; లియో మూవీపై వస్తున్న ఆ వార్తలు నిజమే.. ఎట్టకేలకు ఒప్పుకున్న లోకేష్

ఇక తాజాగా ఇండియన్2 మూవీ నుండి బిగ్ అప్డేట్ ఇచ్చాడు దర్శకుడు శంకర్. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను నవంబర్ 3న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇదే విషయాన్ని శంకర్ తన ట్వీటర్ ద్వారా తెలిపాడు. దీనితో పాటు పవర్ ఫుల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు శంకర్. ఈ పోస్టర్ ఆడియన్స్ లోల్ ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇక ఇండియన్2 సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో కమల్ కు జోడీగా కాజల్ అగర్వాల్(Kajal agarwal,) నటిస్తున్నారు. హీరో సిద్దార్థ్(Siddarth) కీ రోల్ లో కనిపించనున్న ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్(Anirudh) సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.