
టాలీవుడ్ ప్రముఖ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో తెలుగు ప్రముఖ హీరోలైన నారా రోహిత్, మంచు మనోజ్ గెస్ట్ అప్పీయరెన్స్ పాత్రలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాత కేకే రాధామోహన్ నిర్మిస్తున్నాడు.
తమిళ్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులోభాగంగా భైరవం సినిమాలో సాయి శ్రీనివాస్ కి జోడిగా నటిస్తోంది. గురువారం రోజున భైరవం సినిమాలో అదితి శంకర్ పాత్రని రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.
Introducing the beautiful @AditiShankarOfl ? as the ?????? ????? 'Vennela' from the intense world of #Bhairavam ?
— Vijay Kanakamedala (@DirVijayK) November 14, 2024
She will capture your hearts like never before ❤️@BSaiSreenivas @HeroManoj1 @IamRohithNara @KKRadhamohan @dophari @satyarshi4u @ToomVenkat… pic.twitter.com/tiv72pFBQB
ఈ పోస్టర్ లో అదితి శంకర్ అచ్చమైన పల్లెటూరి అల్లరి పిల్లగా కనిపించింది. ఈరోజు (నవంబర్ 15) ఈ సినిమాలో మరో హీరోయిన్ అయిన దివ్య పిళ్ళై పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా దివ్య పిళ్ళై నారా రోహిత్ కి జోడీగా నటిస్తున్నట్లు సమాచారం. అయితే దివ్య పిళ్లై తెలుగులో ప్రముఖ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మంగళవారం సినిమాలో జమీందార్ భార్య పాత్రలో నటించింది. ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది.
Talented actress @DivyaPillaioffl ? as the ??????? ????? 'Poornima’ from the intense world of #Bhairavam ?@BSaiSreenivas @HeroManoj1 @IamRohithNara @AditiShankarOfl @KKRadhamohan @dophari @satyarshi4u @ToomVenkat @sricharanpakala pic.twitter.com/T9BRkT1VuM
— Vijay Kanakamedala (@DirVijayK) November 15, 2024
ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ గా కోలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ కాయల్ ఆనంది కూడా నటిస్తోంది. కాగా ఆనంది నీలిమా పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
Mesmerizing @anandhiactress ? as the ????????? ?????? 'Neelima' from the intense world of #Bhairavam ?@BSaiSreenivas @HeroManoj1 @IamRohithNara @AditiShankarOfl @DivyaPillaioffl @KKRadhamohan @dophari @satyarshi4u @ToomVenkat @sricharanpakala @Brahmakadali… pic.twitter.com/py0AFjIKUo
— Vijay Kanakamedala (@DirVijayK) November 15, 2024
ఈ విషయం ఇలా ఉండగా భైరవం సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. దీంతో త్వరలోనే టీజర్, రిలీజ్ డేట్ అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.