పాయల్ చెంగప్ప లీడ్ రోల్‌లో శ్రీ తేజ్ ఎస్.కె. తెరకెక్కించిన చిత్రం ‘మయూఖ’. శశిధర్ నల్ల నిర్మించారు. ఈనెల 9న సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీతేజ్ మాట్లాడుతూ ‘సినిమా బండి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పలు ఆసక్తికర చిత్రాలు నిర్మించిన నేను ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నా. ‘మయూఖ’ అంటే ఆశాకిరణం. సినిమా చూస్తూ చివరకు వచ్చేసరికి టైటిల్ జస్టిఫై అయ్యేలా ఉంటుంది. హీరోయిన్ ఉండే ఫ్లాట్‌లోకి వచ్చిన అపరిచిత వ్యక్తి ఎవరు, ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, తనతో ఆమెకు ఉన్న రిలేషన్ ఏమిటి లాంటి అంశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది.
మయూఖగా పాయల్ చెంగప్ప అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు. ఆమె క్యారెక్టర్ పడే స్ట్రగుల్స్‌ను ఆడియెన్స్ బాగా రిలేట్ చేసుకుంటారు. స్టోరీ కొద్ది కొద్దిగా రివీల్ అవుతూ సెకండాఫ్ వచ్చేసరికి పీక్స్‌కు వెళ్తుంది. స్క్రీన్ ప్లే, స్టోరీని ప్రెజెంట్ చేసే విధానం కొత్తగా, క్వాలిటీగా ఉంటుంది. అందుకే ఇటీవల న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్‌లో థ్రిల్లర్ కేటగిరీలో సెకండ్ బెస్ట్ వచ్చింది.
విజువల్, సౌండ్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. క్వాలిటీగా చేశాం. శిబి మాత్యూ అలెక్స్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. కచ్చితంగా ప్రేక్షకులకు న్యూ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా అవుతుంది. ఇక ఈ సినిమా తర్వాత ఓ ఎమోషనల్ సైన్స్ ఫిక్షన్ మూవీ చేయబోతున్నా’ అని చెప్పాడు.
