
కామెడీకి కమర్షియల్ టచ్ ను జోడించి ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను సొంతం చేసుకున్న డైరెక్టర్ శ్రీను వైట్ల(Srinu Vaitla). కొంతకాలం నుంచి వరుస డిజాస్టర్ తో సినిమాలకు దూరమై..మరోసారి తనదైన పంథాలో మూవీ తీసి హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. హీరో గోపీచంద్ తో(Gopichand 32 movie) కలిసి కామిక్ ఎంటర్ టైన్ మెంట్ తో సినిమా (సెప్టెంబర్ 24న) స్టార్ట్ అయినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ఇటలీలోని మిలాన్ నగరంలో కంప్లీట్ అయినట్లు శ్రీను వైట్ల ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ షెడ్యూల్ లో కీలకమైన యాక్షన్ సీన్లు తీయడంతో పాటు.. ఒక సాంగ్ కూడా షూట్ చేసినట్లు పేర్కోన్నారు. గోపీచంద్, హీరోయిన్ కావ్యా థాపర్(Kavya Thapar) మీద శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో సాంగ్ పిక్చరైజ్ చేశారు. ఈ మిలాన్ షెడ్యుల్ చాలా సాపీగా జరిగిందని..ఇటలీలోని బ్యూటిఫుల్ లొకేషన్లలో గోపీచంద్32 బృందంతో కలిసి వర్క్ చేయడం అద్భుతమైన ఫీలింగ్ అని శేఖర్ మాస్టర్ కూడా ఇన్స్టా లో పోస్ట్ చేశారు.
శ్రీను వైట్ల..గోపీచంద్..కలయికలో వస్తోన్న ఫస్ట్ మూవీ కావడంతో ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకున్నారు. ఈ చిత్రానికి విశ్వం టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్. శ్రీను వైట్ల, గోపీచంద్ మూవీస్ కు గాను టైటిల్ చివర్లో సున్నా వస్తే హిట్ కొట్టడం పక్కా అనే సెంటిమెంట్ ఉంది. ఇక వీరిద్దరి సెంటిమెంట్ కు తగ్గ ఫలితం వస్తోందని గట్టి నమ్మకంతో..ఈ మూవీ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ALSO READ : హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్య
గోపీచంద్32 మూవీని చిత్రాలయం స్టూడియోస్ ప్రొడక్షన్ నెం.1 పై వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. శ్రీనువైట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు ప్రముఖ రచయిత గోపి మోహన్ స్టోరీ అందిస్తున్నాడు. ఫీల్ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది 2024 సమ్మర్ లో రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది.
HAD A GREAT SCHEDULE IN MILAN.. pic.twitter.com/rzH8o2dQKJ
— Sreenu Vaitla (@SreenuVaitla) October 13, 2023