
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సందీప్ శాండిల్య నియమితులయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం సందీప్ శాండిల్య పేరును సిఫార్సు చేసింది. ఈ మేరకు సీఎస్ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 14వ తేదీన సందీప్ శాండిల్య బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా సందీప్ శాండిల్య విధులు నిర్వహిస్తున్నారు.
ALSO READ :నకిలీ హామీలు ప్రకటించమని.. ప్రియాంక గాంధీని కమల్‌నాథ్ ఒత్తిడి చేశారు : శివరాజ్ సింగ్
అక్టోబర్ 12 వరకు హైదరాబాద్ కు ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్ నియమితులయ్యారంటూ వార్తలు వచ్చాయి. సీవీ ఆనంద్ స్థానంలో విక్రమ్ సింగ్ మాన్ ను నియమిస్తూ డిజీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారంటూ వార్తలు షికారు చేశాయి. కానీ అక్టోబర్ 13వ తేదీన హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్యను నియమిస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో నలుగురు కలెక్టర్లు, ముగ్గురు కమిషనర్లు, 13 మంది ఎస్పీలను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. వీరి స్థానాల్లో తాత్కాలిక నియామకాలు చేపట్టాలని సీఎస్ శాంతి కుమారిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో గంటల వ్యవధిలో కొత్త నియమకాలు జరిగిపోయాయి. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ను బదిలీ చేసి, ఆయన స్థానంలో హైదరాబాద్ అదనపు సీపీగా ఉన్న విక్రమ్‌సింగ్ మాన్‌ను నగర సీపీగా నియమించింది.
వరంగల్ సీపీ రంగనాథ్ స్థానంలో నేరవిభాగం డీసీపీగా ఉన్న మురళీధర్ నియమించింది. నిజామాబాద్ సీపీ సత్యనారాయణ స్థానంలో ఎస్.జయరామ్‌కు బాధ్యతలు అప్పగించింది. మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీగా రాములు, నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీగా సి.హెచ్. రమేశ్, జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీగా ఎన్.రవి, మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా జె. చిన్నయ్య, నారాయణపేట జిల్లా ఎస్పీగా కె. సత్యనారాయణ, భూపాలపల్లి జిల్లా ఎస్పీగా ఎ.రాములు, సూర్యాపేట జిల్లా ఎస్పీగా నాగేశ్వరరావు, సంగారెడ్డి జిల్లా ఎస్పీగా పి. అశోక్, జగిత్యాల జిల్లా ఎస్పీగా ఆర్. ప్రభాకర్‌రావు, కామారెడ్డి జిల్లా ఎస్పీగా కె.నరసింహారెడ్డిని నియమించింది.
రాష్ట్రంలో మొత్తం 20 మంది అధికారుల బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేసింది. బదిలీ అయిన వారిలో నలుగురు కలెక్టర్లు, ముగ్గురు సీపీలు, 13 మంది ఎస్పీలు, ముగ్గురు ఇతర శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు. వీరిలో రవాణాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఎక్సైజ్ డైరెక్టర్ ముషారఫ్ అలీ, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ శ్రీదేవి ఉన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్‌కుమార్, యాదాద్రి కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, నిర్మల్ కలెక్టర్ వరుణ్‌రెడ్డితోపాటు హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, రంగనాథ సత్యనారాయణ.. సంగారెడ్డి, కామారెడ్డి, జగిత్యాల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, గద్వాల్, మహబూబాబాద్, భూపాలపల్లి, నారాయణపేట, సూర్యాపేట ఎస్పీలు రమణకుమార్, శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్, కే నర్సింహ, మనోహర్, సృజన, చంద్రమోహన్, కరుణాకర్, వెంకటేశ్వర్లు, రాజేంద్రప్రసాద్‌ను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది.