మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో..వర్షాలకు కొట్టుకుపోయిన కల్వర్టుకు మరమ్మతులు

మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో..వర్షాలకు కొట్టుకుపోయిన కల్వర్టుకు మరమ్మతులు

గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో మంచిర్యాలో రోడ్లు,కల్వర్టులు కొట్టుకుపోయాయి. కోటపల్లి మండలంలో కురుస్తున్న భారీ వర్షాలతో వరదలకు నక్కలపల్లి గ్రామ సమీపంలో కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో సుమారు ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాకపోకలు స్తంభించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

కల్వర్టు కొట్టుకుపోయిన విషయాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి దృ ష్టికి  తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారు. వెంటనే కల్వర్టుకు మరమ్మతులు చేయించాలని మండల అధికారులను ఆదేశించారు. రాకపోకలు నిలిచిపోవడంతో సత్వర చర్యల్లో భాగంగా  తాత్కాలిక  మరమ్మతులు చేపట్టారు. ఈ పనులు స్థానిక పోలీసులు దగ్గరుంచి పూర్తి చేశారు. 

కల్వర్టు తెగిపోయిందని చెప్పగానే వెంటనే స్పందించిన మంత్రి వివేక్ వెంకటస్వామికి, స్థానిక అధికారులకు కృతజ్ణతలు చెప్పారు ఐదు గ్రామా ప్రజలు. 

►ALSO READ | నిండు కుండలా హుస్సేన్ సాగర్..ఫుల్ ట్యాంక్ లెవెల్కు నీటిమట్టం