నిండు కుండలా హుస్సేన్ సాగర్..ఫుల్ ట్యాంక్ లెవెల్కు నీటిమట్టం

నిండు కుండలా హుస్సేన్ సాగర్..ఫుల్ ట్యాంక్ లెవెల్కు నీటిమట్టం

హైదరాబాద్: ఎగువ ప్రాంతాలనుంచి వస్తున్న వరద  ప్రవాహంతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. బంజారా, కూకట్ పల్లి,  బుల్కాపూర్ నాలాలనుంచి హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో హుస్సేన్ సాగర్ నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ కు చేరింది. 

హుస్సేన్  సాగర్  పూర్తి స్థాయి నీటిమట్టం 513.41 మీట్లరు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 513.19 మీటర్లకు చేరింది. FTL పరిధి దాటకుండా వాటర లెవెల్ ను మెయింటెన్ చేస్తున్నారు అధికారులు. తూముల ద్వారా మిగతా నీటిని మూసిలోకి విడుదల  చేస్తున్నారు. 

హుస్సేన్ సాగర్ కు ఎగువనుంచి 400 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా..776 క్యూసెక్కుల నీటి ని ఔట్ ఫ్లో ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వరదనీరు అశోక్ నగర్, దోమలగూడ, అంబర్ పేట్  గోల్నాక ద్వారా వెల్లి మూసీ లో వరద నీరు కలుస్తుంది. 

►ALSO READ | ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం