ది కేరళ స్టోరీ డైరెక్టర్, హీరోయిన్ ఆదా శర్మకు రోడ్డు ప్రమాదం

ది కేరళ స్టోరీ డైరెక్టర్, హీరోయిన్ ఆదా శర్మకు రోడ్డు ప్రమాదం

ది కేరళ స్టోరీ సినిమా డైరెక్టర్ సుధీప్తో సేన్, హీరోయిన్ ఆదా శర్మ రోడ్డు ప్రమాదానికి  గురైనట్లు తెలుస్తోంది.  ముంబైలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తుండగా  రోడ్డు ప్రమాద బారినట్లు పడినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన డైరెక్టర్ సుధీప్తో సేన్, ఆదా శర్మ ను  ఆసుపత్రికి తరలించి .. చికిత్స అందిస్తున్నారు. 

ది కేరళ స్టోరీ డైరెక్టర్ సుధీప్తోసేన్ మే 14వ తేదీ సాయంత్రం కరీంనగర్ లో జరిగే హిందూ ఏక్తాయాత్రకు హాజరవ్వాల్సి ఉంది. అయితే ప్రమాదం కారణంగా హాజరు కాలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో హిందూ ఏక్తా యాత్రకు హాజరుకాలేకపోవడం బాధగా ఉందని పేర్కొంటూ డైరెక్టర్ సుదీప్తో సేన్ ట్వీట్ చేశారు.