
హీరో ఉదయ్ కిరణ్ మరణం గురించి తెలిసికూడా చాలామందికి తెలియనట్టు నటిస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు దర్శకుడు తేజ. ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘అహింస’. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఉదయ కిరణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఇందులో భాగంగా యాంకర్.. ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ గురించి చెప్పమని అడిగింది.
దానికి సమాధానంగా తేజ.. ‘‘దాని గురించి నేను చెబుతాను కానీ.. చాలా మంది‘మీరే చెప్పండి’ అని అమాయకంగా యాక్ట్ చేస్తున్నారు’’ అని తేజ సమాధానమిచ్చారు. అంతకుముందు.. ఉదయ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఎం చెప్తారు అని అడగగా.. పాపం అని అన్నారు తేజ. ప్రస్తుతం తేజ చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. గతంలో కూడా ఉదయ్ కిరణ్ ఎందుకు చనిపోయాడో కారణం తనకు తెలుసని చెప్పిన సంగతి తెలిసిందే.
ఇక ఉదయ్ కిరణ్ హీరోగా లాంచ్ చేసింది తేజనే. ‘చిత్రం’ సినిమాతో సూపర్‌హిట్ అందుకున్న ఈ కాంబోలో.. ‘నువ్వు నేను’, ‘ఔనన్నా కాదన్నా’ వంటి సినిమాలు కూడా చేశారు. ఇక తేజ లేటెస్ట్ మూవీ ‘అహింస’ విషయానికొస్తే.. అభిరామ్ దగ్గుబాటి ఈ సినిమాతో కథానాయకుడిగా పరిచయం అవుతున్నాడు. ఆర్.పి. పట్నాయక్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.