
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ (Sandeep Kishan) ఇటీవలే ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.ఈ విజయం అందించిన ఊపుతో మరో కొత్త సినిమాను మొదలుపెట్టేశాడు ఈ యంగ్ హీరో.
దర్శకుడు త్రినాధరావు నక్కినతో తన నెక్స్ట్ సినిమాను చేయబోతున్నాడు సందీప్. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా రీసెంట్ గా వచ్చేసింది. #SK30 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తాజాగా హనుమాన్ జయంతి సందర్బంగా (ఏప్రిల్ 23న) SK30 పూజా కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దిల్ రాజ్ క్లాప్‌నివ్వగా..విజయ్ కనకమేడల కెమెరా స్విఛాన్ చేశారు. ప్రొడ్యూసర్ అనిల్ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి రాజేశ్ దండా నిర్మాత కాగా..ధమాఖా, నేను లోకల్ సినిమాల రైటర్ ప్రసన్నకుమార్ కథ, కథనం, మాటలు అందిస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ విభిన్న పాత్రలో కనిపించనున్నారట.
ఇక త్రినాధరావు ఇటీవలే మాస్ మహారాజ్ రవితేజతో ధమాకా లాంటి భారీ హిట్ అందించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టిన విషయం తెలిసిందే. దీంతో సందీప్ కిషన్, త్రినాధరావు సినిమాపై ఇప్పటినుండే అంచనాలు ఏర్పడుతున్నాయి.
The family entertainer #SK30 kicks off on an auspicious note with the gracious presence of loved ones at the Pooja ceremony ?❤️
— AK Entertainments (@AKentsOfficial) April 23, 2024
Clap by #DilRaju ?
First shot direction @AnilSunkara1
Camera Switch on @DirVijayK ? @sundeepkishan @TrinadharaoNak1 #RaoRamesh @RajeshDanda_… pic.twitter.com/as9S4tTOpb