బిగ్ అనౌన్స్మెంట్.. మహాభారతంపై సంచ‌ల‌న ద‌ర్శ‌కుడి సినిమా

 బిగ్ అనౌన్స్మెంట్.. మహాభారతంపై సంచ‌ల‌న ద‌ర్శ‌కుడి సినిమా

మహాభారతం(Mahabharat)..అనే పేరు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. మహాభారత ఇతిహాస కథలు అనేవి.. ఏ ఒక్కరికో చెందినది కాదు. దీనికి పేటెంట్ రైట్స్ అనేవి లేవు కాబ‌ట్టి ఎంత మందైనా..ఎలాగైనా..పర్వాల ఆధారంగా, పాత్రల ఆధారంగా తెరకెక్కించే అవకాశం ఉంది. 

మన టాలీవుడ్ విషయానికి వస్తే..దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli)  తెరకెక్కించబోయే చివరి సినిమా మహా భారతం అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం రాజమౌళి మహాభారతంలో నటించబోయే హీరోస్ ను కూడా సెలెక్ట్ చేసుకున్నట్లు టాక్ గట్టిగానే వినిపిస్తోంది. 

లేటెస్ట్ గా బాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) మహాభారతాన్ని తెరెకెక్కిస్తున్నట్లు తన ట్విట్టర్ ఎక్స్‌లో ప్రకటించారు. ఇక తను తీయబోయే సినిమాకు ‘పర్వ’ (Parva) అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ..పోస్టర్ను రిలీజ్ చేశారు . ‘ధర్మానికి సంబంధించిన ఓ పురాణకథ’ అనేది ట్యాగ్‌లైన్‌. పోస్టర్ తోనే పాజిటివ్ వైబ్ను క్రియేట్ చేశారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. అలాగే ఈ సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. 

క‌న్న‌డ రైటర్ ఎన్. ఎల్. బైర‌ప్ప మ‌హాభార‌తం ఆధారంగా రాసిన  ప‌ర్వ అనే పుస్త‌కాన్ని.. వివేక్ అగ్ని హోత్రి సినిమా రూపంలో తీసుకొస్తున్నారు. ఇప్ప‌టికే పర్వ పుస్త‌కాన్ని ప‌లు భాష‌ల్లోనూ అనువ‌దించారని..ఇంతటి గొప్ప కథను సినిమాగా తీసుకురావడం ఎంతో బాధ్యతగా ఫీల్ అవుతున్నట్లు వివేక్ తెలిపారు.

వివేక్ అగ్ని హోత్రి ది కాశ్మీర్ ఫైల్స్(The Kashmir files) లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత, భారీ అంచనాలతో వచ్చిన ది వ్యాక్సిన్ వార్తో.. యావరేజ్ హిట్ కూడా సొంతం చేసుకోలేకపోయారు. కానీ, ఈ మూవీ స్క్రిప్ట్ ఆస్కార్‌ లైబ్రెరీలో శాశ్వత స్థానం పొందింది. ఈ సినిమాలో  కరోనా వ్యాక్సిన్ కనుగొనడంలో భారత శాస్త్రవేత్తల నిర్విరామ కృషిని కళ్ళకు కట్టినట్లు చూపించారు.

ALSO READ : దర్శకుడిగా త్రివిక్రమ్ కుమారుడి ఎంట్రీ.. హీరో ఎవరో తెలుసా?

ఇక మరోసారి తనదైన శైలిలో మహాభారతం వంటి భారీ ప్రాజెక్ట్ ను ప్రకటిస్తూ..సంచలనం సృష్టిస్తున్నారు. ఎందుకంటే ఇంతటి గొప్ప ప్రాజెక్ట్ ను తెరకెక్కించాలంటే అందుకు తగ్గ నటులు, టెక్నిషన్స్, ప్రొడ్యూసర్స్ అవసరం. మరి ఏ రేంజ్లో తీయబోతున్నాడో అని ఎదురుచూస్తున్నారు పలు ఇండస్ట్రీ మేకర్స్. త్వరలో ఈ ప్రాజెక్ట్ నుంచి మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.