
ప్రముఖ సినీ దర్శకుడు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బి నరసింగరావు(B Narsingarao) సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేటీఆర్ ను విమర్శిస్తూ బహిరంగ లేక రాశాడు.
"గత 40 రోజుల నుండి, ప్రతి రెండు రోజులకు ఒకసారి నిన్ను అపాయింట్మెంట్ అడుగుతున్నాను, నాకు అపాయింట్మెంట్ ఇవ్వవా? నీ రెండు లక్షల కోట్ల అభివృద్ధి నాకు రెండు చిల్లి గవ్వలతో సమానం కూడా కావు. రాజ్యం ఏలడమే కాదు, రాజ్యంలో ఎవరు, ఏమిటి అన్న విజ్ఞత కూడా ఉండాలి. ఉన్నత వ్యక్తులను అత్యంత హీనంగా అణిచివేయడం ఎంత నీచమో ఒకసారి ఆలోచించు. అంత గొప్ప హీనులు నీ సలహాదారులు. అంత గొప్ప ఏలిక నీది. ఏ సంస్కృతి నుండి వెలసిన కమలాలు మీరు. మీ గత జాడల ఆనవాళ్ళు ఏమిటి? ఇవన్నీ బహిరంగంగా మాట్లాడుకుందాం రా" అంటూ రాసుకొచ్చాడు
ప్రస్తుతం బి నరసింగరావు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఇంత ఆగ్రహం వెనక ఉన్న కారణమేంటని పలువురు చర్చించుకుంటున్నారు. మరి బి నరసింగరావు రాసిన ఈ బహిరంగ లేఖపై మంత్రి కేటీఆర్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.