తండ్రికి కరోనా వైరస్.. తిండి లేక వీల్ చైర్ లోనే చనిపోయిన కొడుకు

తండ్రికి కరోనా వైరస్.. తిండి లేక వీల్ చైర్ లోనే చనిపోయిన కొడుకు

తల్లి చనిపోయింది.. తండ్రేమో కరోనా వైరస్ తో ఆస్పత్రిలో  ఉన్నాడు. కొడుకేమో పక్షవాతంతో వీల్‌చైర్‌కు కే పరిమితం. నడవలేడు, మాట్లాడలేడు, తినలేడు. తిండి లేక,పట్టించుకునే వారు లేక వారం రోజుల పాటు వీల్ చైర్ లోనే ఉన్నాడు. అదే వీల్ చైర్ లో చివరకు ప్రాణాలు విడిచాడు. హృదయాన్ని కలిచివేస్తున్న ఈ ఘటన చైనాలోని బీజింగ్ లో  జరిగింది.

యాన్ చెంగ్ (17) అనే బాలుడి తల్లి చాలా రోజుల క్రితం చనిపోయింది. తండ్రి యాన్ జియావోన్‌ ను తీవ్ర జ్వరం కారణంగా జనవరి 22 న ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో వీల్ చైర్ లో ఉన్న యాన్ చెంగ్ ను ఇంట్లోనే వదిలేసి వెళ్లారు.  ఆస్పత్రిలో చేరిన ఐదు రోజుల తర్వాత తన తండ్రి కరోనా వైరస్ తో బాధపడుతున్నట్లు తెలిసింది. అయితే ఇంట్లో వీల్ చైర్ లో ఉన్న యాన్ చెంగ్ ను పట్టించుకునే వారు లేరు. బంధువులు కానీ స్థానికులు కానీ ఎవరూ పట్టించుకోలేదు. అతని ఆలనా పాలన చూసుకునే వారు లేక వారం రోజుల పాటు వీల్ చైర్ లోనే పడి ఉన్నాడు.  దయచేసి ఎవరైనా సాయం చేయాలని.. ఎవరైనా వెళ్లి తన కొడుకును చూసుకోవాలని  తండ్రి యాన్ జియావోన్  సోషల్ మీడియా ద్వారా వేడుకున్నాడు. అయితే ఈ విషయం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. అప్పటిలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వీల్ చైర్ లో ఉన్న యాన్ చెంగ్ జనవరి 29 న చనిపోయినట్లు హోంగాన్ కౌంటీ ప్రభుత్వం ప్రకటించింది. బాలుడిని కాపాడడంలో స్థానిక అధికారులు విఫలమయ్యారని కమ్యూనిస్టు ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దీంతో స్థానిక కమ్యూనిస్ట్ కార్యదర్శి, మేయర్ ను సస్పెండ్ చేసింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా  చైనాలో 20,000 మందికి పైగా ప్రజలు కరోనావైరస్ బారిన పడ్డారు,  ఇప్పటి వరకు 425 మంది చనిపోయారు.

see more news

ఫ్లైట్ లో పురిటినొప్పులు .. ఎమర్జెన్సీ ల్యాండ్

మరో వివాదంలో ట్రంప్.. జాతీయగీతం వస్తుండగా డ్యాన్స్