
బోధన్, వెలుగు: ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి దివ్యాంగులు, ఫించన్‌దారులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి సుజాత సూర్యవంశీ డిమాండ్‌చేశారు. గురువారం బోధన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించి మాట్లాడారు. దివ్యాంగులకు నెలకు రూ.6 వేలు, ఫించన్‌దారులకు రూ.4 వేల ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
కాంగ్రెస్ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేడ్లు పూర్తవుతున్నా నేటికీ ఫించన్లు పెంచలేదన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీ ప్రకారం ఫించన్లు అందించాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో ఎంఆర్పీయస్, ఎంఎస్పీ నాయకులు గుమ్ముట్టు పద్మ, లక్ష్మిగారి భూమయ్య, బండారి పోశేట్టి, తాడెం అబ్బయ్య, రవి కుమార్, శేఖర్ తదితరులు పాల్గోన్నారు.