ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందు పంపిణి నిలిపివేత

V6 Velugu Posted on May 21, 2021

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య అనే వ్యక్తి కరోనా నివారణ ఔషధం అంటూ ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్నాడు. దీనిపై సీఎం జగన్ కూడా దృష్టి సారించి, శాస్త్రీయ అధ్యయనం అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. నెల్లూరు జిల్లా యంత్రాంగం ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీని నిలిపివేసింది. దీనిపై నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు వివరణ ఇచ్చారు.

మూలికా ఔషధం పంపిణీ ఆపివేశామని.. ఈ ఔషధంకు సంబంధించి శాంపిళ్లను డీఎంహెచ్ఓ, ఆయుష్ అధికారులు హైదరాబాదులోని ఓ ప్రయోగశాలకు పంపారని తెలిపారు కలెక్టర్. దీనిపై ICMR  శాస్త్రీయ పరిశోధన చేయాల్సి ఉందని, ఆ పరిశోధనలో తెలిసే అంశాల ఆధారంగానే..ఆయుర్వేదం మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలా..వద్దా.. అనేది నిర్ణయిస్తామని తెలిపారు. అప్పటివరకు మందు పంపిణీకి అనుమతి లేదని స్పష్టం చేశారు.

Tagged AP, Discontinuation distribution, Anandayya Ayurvedic Corona drug

Latest Videos

Subscribe Now

More News