
అలియా భట్(Alia Bhatt)– రణ్వీర్ సింగ్(Ranveer Singh) జంటగా నటించిన ‘రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కథా’(Rocky Aur Rani Kii Prem Kahaani) సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. అలియాను ఇండస్ట్రీకి పరిచయం చేసిన కరణ్ జోహార్(Karan Johar) దీనికి దర్శకత్వం వహించాడు. ఫ్యామిలీ అండ్ లవ్ డ్రామాగా సినిమా ఉండనున్నట్టు తెలుస్తోంది. రణ్ వీర్, అలియా జోడీకి మంచి రెస్పాన్స్ వస్తోంది.
అయితే, ఇప్పుడీ ట్రైలర్లో ఒక విషయం అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. నిమిషం పాటు లెంత్ ఉన్న ఈ ట్రైలర్లో ఈ హీరోయిన్ ఏకంగా 20 చీరల్లో కనిపించింది. ఈ సినిమాకన్నా అలియా కట్టిన చీరల గురించే ఇప్పుడంతా చర్చించుకుంటున్నారు. ఈ నెల 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ తారాగణంతో వస్తున్న ఈ ఫ్యామిలీ డ్రామాలో ధర్మేంద్ర(Dharmendra), జయా బచ్చన్(Jaya Bachchan) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్(Dharma Production) బ్యానర్లో దీనిని నిర్మించారు..