ఇయ్యాల మేనేజ్​మెంట్లు, ఉద్యోగ సంఘాల జేఏసీ మధ్య చర్చలు

ఇయ్యాల మేనేజ్​మెంట్లు, ఉద్యోగ సంఘాల జేఏసీ మధ్య చర్చలు
  •     ఏడాదిగా విద్యుత్‌‌‌‌‌‌‌‌ సంస్థల నిర్లక్ష్యం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్ర విద్యుత్‌‌‌‌‌‌‌‌ సంస్థల్లో ఉద్యోగుల ఫిట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై పంచాయితీ తేలడం లేదు. గతేడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ నుంచి అమలు చేయాల్సిన పే రివిజన్‌‌‌‌‌‌‌‌ ఇప్పటి వరకు అమలు చేయలేదు. దీనిపై విద్యుత్‌‌‌‌‌‌‌‌ సంస్థల్లోని 30వేల మంది ఉద్యోగు లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించామని.. విద్యుత్‌‌‌‌‌‌‌‌ సంస్థల మేనేజ్​మెంట్లు ఏడాదిగా నిర్లక్ష్యం చేయడం తగ దంటున్నారు. ఇటీవల విద్యుత్‌‌‌‌‌‌‌‌ సంస్థల యాజమా న్యాలు.. విద్యుత్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతిని ధులతో సమావేశమయ్యాయి. పీఆర్‌‌‌‌‌‌‌‌సీపై వేత న కమిటీ ప్రపోజ్‌‌‌‌‌‌‌‌ చేసిన 5% ఫిట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు అదనంగా 1% కలిపి 6%  ఫిట్మెంట్ ఇస్తామని మేనేజ్​మెంట్లు తెలిపాయి. 30% ఫిట్​మెంట్ ఇవ్వాలని జేఏసీ డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఐదేండ్లలో నిత్యవసర వస్తువుల ధరలు, విద్య, వైద్య ఖర్చులు పెరిగాయని, వాటికనుగుణంగా వేతన సవరణ చేయాలని కోరారు. ఫిట్​మెంట్‌‌‌‌‌‌‌‌పై ఎటూ తేల్చకుండానే మీటింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలో విద్యుత్‌‌‌‌‌‌‌‌ సంస్థల యాజమాన్యం, జేఏసీ ప్రతినిధుల మధ్య శుక్రవారం మరోసారి చర్చలు జరగనున్నాయి.

జీపీఎఫ్‌‌‌‌‌‌‌‌ అమలు చేయాలి

1999 నుంచి 2004 మధ్య ఉద్యోగాల్లో చేరిన వారికి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ఎంప్లాయిస్​కోరుతున్నారు. ఈ ఐదేండ్లలో నియామకాలకు సంబంధించి ఇచ్చిన అపాయింట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ లెటర్లలో జీపీఎఫ్‌‌‌‌‌‌‌‌ తొలగిస్తున్నట్లుగా కానీ ఈపీఎఫ్‌‌‌‌‌‌‌‌ ఇస్తామని ఎక్కడా పేర్కొన లేదు. ఈ మధ్యకాలంలో వివిధ విభాగాల్లో మొత్తం 5066 మంది జాయిన్ అయ్యారు. తమకు న్యాయంగా అమలు కావాల్సిన జీపీఎఫ్ అమలు కావట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నరు. 1999లో చేరిన ఉద్యోగులకు యాజమాన్యాలు జీపీఎఫ్‌‌‌‌‌‌‌‌ జమ చేశా యి. 2003లో విద్యుత్‌‌‌‌‌‌‌‌ సంస్థల యాజమాన్యం ఈపీఎఫ్‌‌‌‌‌‌‌‌ సౌకర్యాన్ని 1999 నుంచి వర్తింపచేయాలని జీవో జారీ చేసింది. అయితే పాత తేదీ నుంచి అమలయ్యేలా ఉత్తర్వులు ఇవ్వడం చట్ట విరుద్ధమని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయి. కానీ 2004 దాకా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్నట్లుగానే విద్యుత్ ఉద్యోగులకు కూడా పాత పెన్షన్‌‌‌‌‌‌‌‌ విధానం వర్తింపజేయాలని విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్​చేస్తున్నది.