సూది గుచ్చరు.. రక్తం తీయకుండానే టెస్టులు

సూది గుచ్చరు.. రక్తం తీయకుండానే టెస్టులు

హెల్త్ చెకప్ కోసం రక్త పరీక్ష, ఈసీజీ, బయాప్సీ అంటూ రకరకాల టెస్టులు చేయించుకోవాలి. అయితే, అవేవీ అవసరం లేకుండా హైదరాబాద్ లోని డమాగ్రొస్టిక్ సెంటర్ ఆర్కా ల్యాబ్ కొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. థర్మల్ స్క్రీనింగ్ డివైజ్ టెక్నాలజీని ఉపయోగించి శరీరంలోని వ్యాధుల్ని గుర్తించొచ్చు అంటున్నారు ఆ సంస్థ సీఈఓ గాయత్రి. ఈ పరికరం తయారుచేసింది హైదరాబాద్ లోనే. డివైజ్ సాంకేతికతను బెంగళూరు కేంద్రం నుంచి తీసుకున్నారు.

నిలబడిన చోట ముఖ కవళికలను డివైజ్ లోని కెమెరా రికార్డు చేసి, ప్రత్యేక సాఫ్ట్ వేర్ సాయంతో ఎనలైజ్ చేస్తుంది. దాంతో బీపీ, డయాబెటిస్, గుండె సంబంధ వ్యాధులను సులభంగా గుర్తించొచ్చు. ఈ డివైజ్ ద్వారా ఇప్పటివరకు 4 వేల మందికి థర్మల్ స్క్రీనింగ్ చేయగా 91శాతం మందికి కచ్చితమైన ఫలితాలు వచ్చాయని ఆర్కా సంస్థ తెలిపింది. హైదరాబాద్ లోని కిమ్స్ తో పాటు మరికొన్ని సెంటర్లలో ఈ థర్మల్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.