దిశ కమిషన్: మొదటి రోజు ముగిసిన విచారణ

దిశ కమిషన్: మొదటి రోజు ముగిసిన విచారణ

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు వ్యవహారంపై సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో కూడిన కమిషన్‌ను ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి, న్యాయవాది, సీబీఐ మాజీ డైరెక్టర్‌లతో ఏర్పాటైన ఈ కమీషన్ సోమవారం హైదరాబాద్ కు చేరుకొని కేసుపై విచారణ చేపట్టింది.

మూడు రోజులపాటు హైదరాబాద్ లోనే ఉండనున్న ఈ బృందం.. మొదటి రోజు విచారణను పూర్తి చేసింది. షీల్డ్ కవర్లో నిందితుల పోస్టుమార్టం రీ పోస్టుమార్టం రిపోర్ట్ ను కూడా కమిషన్ పరిశీలించింది.ఈ కేసుకు సంబంధించి సిట్ నివేదిక ను సిట్ ఛీఫ్ మహేష్ భగవత్ కమిషన్ కు  సమర్పించారు.

తర్వాతి విచారణలో భాగంగా ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసు సిబ్బందిని కమిషన్  విచారించనుంది. నిందితుల కుటుంబ సభ్యులతో పాటు దిశ ఫ్యామిలీ మెంబెర్స్ యొక్క స్టేట్ మెంట్ ను కమిషన్ రికార్డ్ చేయనుంది. రేపు మరోసారి హైకోర్టు వేదికగా దర్యాప్తు జరపనుంది.