హాలీవుడ్ ఎంట్రీకి సిద్దమైన దిశా పటానీ

హాలీవుడ్ ఎంట్రీకి సిద్దమైన దిశా పటానీ
  • హాలీవుడ్ ఎంట్రీ

సౌత్ హీరోయిన్స్‌ బాలీవుడ్‌ సినిమా అవకాశాల కోసం ఎంతలా ఎదురుచూస్తారో.. బాలీవుడ్ హీరోయిన్స్‌ హాలీవుడ్ వైపు అంతే ఆశగా చూస్తుంటారు. అప్పుడప్పుడు కొందరు స్టార్స్‌ను ఈ అవకాశాలు వరిస్తుంటాయి.  గ్లామర్ రోల్స్‌కు కేరాఫ్ అయిన దిశా పటానీకి అలాంటి అవకాశమే లభించింది.  ఆస్కార్ విన్నింగ్ యాక్టర్‌‌‌‌ కెవిన్ స్పాసే తెరకెక్కించనున్న ‘హోలీ గార్డ్స్‌’ చిత్రంలో ఆమె కీలకపాత్రలో కనిపించబోతోంది. ఇదొక సూపర్ నేచురల్ యాక్షన్ థ్రిల్లర్.

 ది ఎక్స్‌పెండబుల్స్ ఫేమ్ డాల్ఫ్ లండ్‌గ్రెన్,  ఫాస్ట్ & ఫ్యూరియస్ ఫేమ్ టైరీస్ గిబ్సన్,  డెడ్‌పూల్ ఫేమ్ బ్రియానా హిల్డెబ్రాండ్ లాంటి హాలీవుడ్ స్టార్స్‌ ఇందులో నటిస్తున్నారు.  ఈ ఏడాది ప్రారంభంలో దిశా ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంది. ఈ మూవీ సెట్‌ నుంచి వచ్చిన  దిశా ఫోటో ఒకటి ఆమధ్య వైరల్ అయింది.  మెక్సికోలోని డురాంగోలో ఎక్కువభాగం ఈ సినిమాను చిత్రీకరించారు.  ప్రస్తుతం  పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

ఇటీవల జరిగిన కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ మూవీ ట్రైలర్‌‌ను ప్రదర్శించారు.  20 ఏళ్ల తర్వాత కెవిన్‌ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు నెలకొన్నాయి.  తన ఫస్ట్ హాలీవుడ్ మూవీ పట్ల ఫుల్‌ ఎక్సైటింగ్‌గా ఉంది దిశా. అలాగే ఆమె ‘వెల్‌కమ్’ ఫ్రాంచైజీలో వస్తున్న ‘వెల్‌కమ్ టు ది జంగిల్‌’లో ఆమె నటిస్తోంది.