227 మంది  డాక్టర్ల తొలగింపు

227 మంది  డాక్టర్ల తొలగింపు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లలో పనిచేస్తున్న 227 మంది డాక్టర్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పోయినేడు కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో కాంట్రాక్ట్ బేసిస్‌‌పై వీళ్లను నియమించారు. ఆర్నెళ్ల కాంట్రాక్ట్‌‌పై తీసుకున్న సర్కార్, ఆ తర్వాత మరో 6 నెలలు పొడిగించింది. నిరుడు జులై నుంచి ఈ జులైకి ఏడాది సర్వీస్ పూర్తికావడం, కరోనా కేసులు తగ్గిపోవడంతో.. డాక్టర్ల సర్వీస్ కొనసాగింపునకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో వీళ్లందరినీ ఉద్యోగాల నుంచి తొలగించాలని అన్ని జిల్లాల డీఎంహెచ్‌‌వోలకు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం నుంచి కొనసాగింపు ఉత్తర్వులు రానందున, వెంటనే ఆయా డాక్టర్లను ఉద్యోగాల నుంచి తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.