ఆర్డీవో ఆఫీస్ ఎదుట గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల ఆందోళన

ఆర్డీవో ఆఫీస్ ఎదుట గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల ఆందోళన
  • గుంటకు రూ.లక్ష పరిహారం ఇవ్వాలని డిమాండ్

హనుమకొండ, వెలుగు: గౌరవెల్లి ప్రాజెక్టులో భూమి కోల్పోతున్న తమకు గుంటకు రూ.లక్ష చొప్పున ఎకరాకు రూ.40 లక్షల పరిహారం చెల్లించాలని భూ నిర్వాసితులు డిమాండ్  చేశారు. భీమదేవరపల్లి మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన నిర్వాసితులు మంగళవారం హనుమకొండ ఆర్డీవో ఆఫీస్  ఎదుట ఆందోళనకు దిగారు.

 గౌరవెల్లి ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, ప్రాజెక్టులో భూమి కోల్పోతున్న తమకు తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్  చేశారు. తమ పిల్లలకు  గౌరవెల్లి ప్రాజెక్ట్ లో ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్  చొరవ తీసుకొని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆర్డీవో రమేశ్  రాథోడ్ కు వినతిపత్రం అందించారు.