ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

మాజీ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సన్మానించిన టీచర్లు, స్టూడెంట్లు
హాజరైన మహిళా ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వీసీ ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

డిచ్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు: కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌‌‌‌‌‌‌‌గా మారిన తెలంగాణ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ మధ్య అంతర్గతంగా ఉన్న విభేదాలు గురువారం జరిగిన ఒక ఘటనతో రచ్చకెక్కాయి. వర్సిటీ వీసీగా వచ్చిన నాటి నుంచి అనేక వివాదాలకు కారణమవుతున్న రవీందర్ గుప్తా ఓ మహిళా ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇష్టం వచ్చినట్లు తిట్టి వార్తల్లోకి ఎక్కారు. తెలంగాణ యూనివర్సిటీ ఆవిర్భావం నుంచి వర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్, మాజీ రిజిస్ట్రార్ శివశంకర్ ఇటీవల బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్నారు. దీంతో వర్సిటీలో గురువారం అయనకి స్టూడెంట్లు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమానికి హజరైన ప్రొఫెసర్ త్రివేణిని వీసీ రవీందర్ గుప్తా తన ఛాంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పిలిపించుకుని తిట్టడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా వీసీ పెట్టిన అనేక వివాదాస్పద బిల్లులను క్లియర్​ చేయకపోవడంతో తన నిర్ణయాలను అమలు పరచకపోవడం వల్లే శివశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిజిస్ట్రార్ పదవి నుంచి తొలగించారనే చర్చ జరిగింది. తన మాట వినని ప్రొఫెసర్ శివశంకర్ సన్మాన కార్యక్రమానికి ఎలా వెళ్తారని మహిళా ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తిట్టినట్లు తెలిసింది. ఇది తన యూనివర్సిటీ అని  ఇక్కడ తన పర్మిషన్​ లేకుండా ఏది జరగకూడదని, తన మాట వినకుంటే బాగుండదని వీసీ చిందులు తొక్కినట్లు సమాచారం.  

రైతులకు లోన్లు ఎందుకు ఇస్తలేరు?

నిజామాబాద్, వెలుగు: పంట రుణాల పంపిణీలో బ్యాంకర్ల నిర్లక్ష్య వైఖరిపై కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  కొత్త కలెక్టరేట్ లో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశంలో ఆయన బ్యాంకుల వారీగా పంట రుణాల పంపిణీ సమీక్షించారు.  ఈ వానాకాలం సీజన్​కు సంబంధించి ఆగస్టు నెలాఖరు నాటికి జిల్లాలో వివిధ బ్యాంకుల ద్వారా 2,33,377 మంది రైతులకు పంట రుణాలు అందించాలని లక్ష్యం ఉండగా, కేవలం 10,8279 మంది రైతులకే లోన్లు ఇచ్చినట్లు గుర్తించారు.  నిర్దేశిత లక్ష్యంలో పంట రుణాల పంపిణీ 50 శాతానికే పరిమితమైందని అన్నారు. వ్యవసాయ టర్మ్ లోన్లకు సంబంధించి కూడా 24 .71 శాతం మాత్రమే పంపిణీ చేశారని వెల్లడించారు.   అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, లీడ్ బ్యాంక్ ఏజీఎం రాజేంద్ర ప్రసాద్, జిల్లా మేనేజర్ శ్రీనివాసులు, నాబార్డు ఈజీఎం నాగేష్, డీఏవో తిరుమల ప్రసాద్, మెప్మా పీడీ రాములు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

వీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యత

లింగంపేట, వెలుగు: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం బొల్లారం గ్రామానికి చెందిన వీఆర్ఏ ఆశోక్​ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని, ఆయన కుంటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు మూడు ఎకరాల భూమిని ఇవ్వాలని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొపెసర్ కోదండరాం డిమాండ్​ చేశారు. గురువారం అశోక్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. బాధిత కుటుంబానికి  ఆర్థిక సాయం అందించారు. అనంతరం ఎల్లారెడ్డి డివిజన్​ కేంద్రంలో వీఆర్ఏలు చేపడుతున్న  సమ్మెలో కోదండరాం పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా  సీఎం కేసీఆర్ వీఆర్ఏలకు పేస్కేల్ అమలు చేస్తామని ప్రకటించి మోసం చేశాడని ఆరోపించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ విధానాల వల్లే నేడు రాష్ట్రం అప్పుల పాలైందని ఆరోపించారు. ఆయన వెంట టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేశ్, రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి శ్రీధర్, జిల్లా కన్వీనర్ లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌యాదవ్ తదితరులు ఉన్నారు.

290 క్వింటాళ్ల రేషన్​బియ్యం పట్టివేత

భిక్కనూరు,వెలుగు: భిక్కనూరు పోలీసులు 290 క్వింటాళ్ల రేషన్​బియ్యం పట్టుకున్నారు. ఎస్సై ఆనంద్​గౌడ్​ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్​ జిల్లా రామయంపేటకు చెందిన బలిజ మహేందర్​అదే మండలంలో పలు గ్రామల్లో ప్రజల వద్ద రేషన్​బియ్యం కొనుగోలు చేసి వాటిని మహారాష్ట్రంలో కోళ్లఫారాలకు అమ్ముతున్నాడు. గురువారం స్థానిక టోల్​ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా లారీలో 290 క్వింటాళ్ల రేషన్​బియ్యం దొరికాయి. దీంతో లారీని సీజ్​చేయడంతోపాటు బియ్యం తరలిస్తున్న లారీ డ్రైవర్​కమ్​ఓనర్​ఇంతీయజ్​ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. నిందితుడు మహేందర్​ను కూడా అదుపులోకి తీసుకుంటామని, బియ్యంను సీవిల్​సప్లయ్స్​ఆఫీసర్లకు అప్పగిస్తామని చెప్పారు.

ఎక్కువ పెన్షన్​ ఇస్తున్నది కేసీఆర్​ ప్రభుత్వమే

కోటగిరి,వెలుగు: కేసీఆర్​ ప్రభుత్వమే వ్యక్తిగతంగా అత్యధిక పెన్షన్​ఇస్తున్నదని స్పీకర్​పోచారం శ్రీనివాస్​రెడ్డి అన్నారు.  గురువారం  మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పెన్షన్ ల పంపిణీ కార్యక్రమంలో స్పీకర్ పాల్గొని మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రాల్లో లేని విధంగా తెలంగాణలో రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్, డబుల్ బెడ్రూం ఇండ్లు వంటి అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని వెల్లడించారు. బాన్సువాడ నియోజకవర్గ ఇన్​చార్జి పోచారం సురేందర్ రెడ్డి, జడ్పీటీసీ శంకర్, ఎంపీపీ వల్లేపల్లి సునీత, వైస్ ఎంపీపీ గంగాధర్, ఏఎంసీ చైర్మన్ లావణ్య, జడ్పీ కోఆప్షన్ మెంబర్ సిరాజ్, మండల్ కోఆప్షన్ మెంబర్ ఇస్మాయిల్, సర్పంచ్ పత్తి లక్ష్మణ్ పాల్గొన్నారు. మండలానికి వచ్చిన స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తమ సమస్యలు పరిష్కరించాలని వీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏలు వినతి పత్రం అందజేశారు.

బాల్య వివాహాలను అడ్డుకోవాలి

కామారెడ్డి, వెలుగు: బాల్య వివాహాలు జరుగకుండా ప్రజలను చైతన్యవంతం చేయాలని కామారెడ్డి కలెక్టర్​ జితేష్ వి పాటిల్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో బాల్య వివాహాల నిర్మూలనపై ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ప్రతి నెల చివరి రోజున బాల్య వివాహాల నిర్మూలన, బడి మానేసిన పిల్లలపై అవగాహన ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌లు చేపట్టాలన్నారు. అంతకుముందు పంచాయతీల నిర్వహణపై రివ్యూ చేశారు. అత్యధిక పంచాయతీలు అవార్డులు సాధించేలా చూడాలన్నారు. స్టేట్ లెవల్‌‌‌‌‌‌‌‌లో అవార్డుల కోసం అప్లికేషన్లు స్వీకరిస్తున్న తరుణంలో తప్పులు లేకుండా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో ఎంట్రీ చేయాలన్నారు. ఈనెల 16, నుంచి 18 వరకు తెలంగాణ జాతీయ వజ్రోత్సవాలను నిర్వహించాలన్నారు. అసిస్టెంట్ కలెక్టర్​శివేంద్ర ప్రతాప్, డీఆర్డీవో సాయన్న, డీపీవో శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రావు, సీఈవో  సాయాగౌడ్ పాల్గొన్నారు. 

ప్రజలను మోసగిస్తున్న టీఆర్ఎస్

నిజామాబాద్, వెలుగు: రాష్ట్రంలోని టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ సర్కారు బూటకపు హామీలతో ప్రజలను మోసగిస్తోందని బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ బస్వా లక్ష్మీనర్సయ్య,  రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌‌‌‌‌‌‌‌పాల్‌‌‌‌‌‌‌‌ సూర్యనారాయణ ఆరోపించారు. ఇందూరులోని 11వ డివిజన్ పరిధి నాగారంలో  గురువారం టీఆర్ఎస్ నాయకుడు గట్ల గంగాధర్ తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ జెండాను ఆవిష్కరించి బైక్‌‌‌‌‌‌‌‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు నాగారం ప్రాంతంలో డబుల్ బెడ్ రూమ్​ఇండ్లను నిర్మించి రెండేళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు ఇప్పటికీ పంపిణీ చేయలేదన్నారు. కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఇండ్లు  నిరుపయోగంగా ఉన్నాయన్నారు. నిరుద్యోగ భృతి కల్పిస్తామని, సొంత స్థలం ఉన్న వారికి రూ.3 లక్షల సాయం, దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ , కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని ఇలా లెక్కకు మించి బూటకపు హామీలు ఇచ్చిన టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే వాటన్నింటిని మర్చిపోయిందని ఆరోపించారు. దేశంలోనే ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ లీడర్లు మాస్టర్ శంకర్, నాగోళ్ల లక్ష్మీనారాయణ, బి.ఆర్ శివప్రసాద్, అమంద్ విజయ్, చావుస్, ఖైజర్, సురేశ్‌‌‌‌‌‌‌‌బాబు, రాకేశ్ పుట్ట వీరేందర్ పాల్గొన్నారు.