అధికారులు సక్రమంగా విధులు నిర్వర్తించాలి :  కలెక్టర్ ఇలా త్రిపాఠి

అధికారులు సక్రమంగా విధులు నిర్వర్తించాలి :  కలెక్టర్ ఇలా త్రిపాఠి
  •  కలెక్టర్​ ఇలా త్రిపాఠి

నిజామాబాద్, వెలుగు:  అధికారులు విధులను సక్రమంగా నిర్వర్తించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించనని హెచ్చరించారు. సోమవారం ఆయా శాఖల అధికారులతో మీటింగ్​ నిర్వహించి మాట్లాడారు. ఎండాకాలం తాగునీటి సమస్య రాకుండా ముందస్తు ప్లాన్​లో ఉండాలన్నారు. ప్రతీ ఇంటికి శుద్ధ జలాలు అందేలా మున్సిపల్​ కమిషనర్లు, ఎంపీడీవో, ఎంపీవోలు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల్లో పురోగతి కనిపించాలని  మండల స్పెషల్​ ఆఫీసర్లు ఫీల్డ్​ విజిట్​తో మానిటరింగ్​ చేయాలన్నారు.

టెన్త్​ ఎగ్జామ్​ సెంటర్లను సబ్​ కలెక్టర్లు, ఆర్డీవో, తహసీల్దార్లు తనిఖీ చేయాలని, పరీక్షల్లో అవకతవకలు జరిగితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అడిషనల్​కలెక్టర్లు కిరణ్​కుమార్, దిలీప్​కుమార్, సబ్​ కలెక్టర్లు అభిగ్యాన్​ మాల్వియ, వికాస్​ మహతో, డీఆర్డీవో సాయాగౌడ్​ ఉన్నారు. అంతకు ముందు కలెక్టర్​ నగరంలోని మానిక్​భవన్​ స్కూల్​, నలంద హైస్కూల్​ టెన్త్​ పరీక్ష సెంటర్లను విజిట్​ చేశారు. ప్రజావాణిలో 140 ఫిర్యాదులు స్వీకరించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.