పోతంగల్ చెక్‌‌ పోస్ట్‌‌ కిసాన్ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్‌‌ మిల్లులో ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి

పోతంగల్ చెక్‌‌ పోస్ట్‌‌ కిసాన్ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్‌‌ మిల్లులో ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి
  •     అంత్యక్రియలు  చేశాక పోస్టుమార్టం

కోటగిరి, వెలుగు: పోతంగల్ చెక్‌‌పోస్ట్‌‌లోని కిసాన్ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్‌‌మిల్లులో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ నెలరోజులపాటు మృత్యువుతో పోరాడి మృతిచెందింది. కోటగిరి మండలానికి చెందిన రేణి మొగులవ్వ(40) ఫిబ్రవరి 15న మిల్లులో పని చేస్తుండగా మెషీన్​ బెల్ట్‌‌లో చీర చిక్కుకుని తీవ్రంగా గాయపడింది. హాస్పిటల్​లో చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతిపై కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అంత్యక్రియలు నిర్వహించారు.

దీంతో అధికారులు సోమవారం తహసీల్దార్ సమక్షంలో శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మళ్లీ అంత్యక్రియలు చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రైస్‌‌మిల్ నిర్వాహకుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తూ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోటగిరి ఎస్సై సునీల్ తెలిపారు.