ఎన్నికల ప్రచారంలో అపశృతి.. టపాసులు కాల్చడంతో బిల్డింగ్కు అంటుకున్న మంటలు

ఎన్నికల ప్రచారంలో అపశృతి.. టపాసులు కాల్చడంతో బిల్డింగ్కు అంటుకున్న మంటలు

సంగారెడ్డిజిల్లా పటాన్చెరులో ఎన్నికల ప్రచారంలో అపశృతిచోటు చేసుకుంది. టపాసులు పేల్చడంతో ఓ బిల్డింగ్ కు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు.

అమీన్పూర్ మండలం పటాన్ చెరు పరిధిలోని కిష్టారెడ్డిపేటలో కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ ప్రచారం నిర్వహిస్తుండగా.. టపాసులు పేల్చడంతో నిప్పు రవ్వలు బిల్డింగ్ పై పడటంతో మంటలు చెలరేగాయి. బిల్డింగ్ మొదటి అంతస్తులో మంటలంటుకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.