విద్యార్థులకు ఉచిత ఎలక్ట్రానిక్ ట్యాబ్లెట్‌‌లు అందించాలి

విద్యార్థులకు ఉచిత ఎలక్ట్రానిక్ ట్యాబ్లెట్‌‌లు అందించాలి

న్యూఢిల్లీ: విద్యార్థులకు ఉచితంగా ఎలక్ట్రానిక్ ట్యాబ్లెట్స్‌‌‌‌ను అందించే దిశగా ప్రభుత్వం సమాలోచనలు చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఇంటర్నెట్‌‌లో అనవసరమైన కంటెంట్‌‌ చూడకుండా ఉండాలంటే ప్రత్యేక ట్యాబ్లెట్లను ప్రభుత్వమే ఇస్తే బాగుంటుందని ప్రధాన్ సూచించారు. ఈ-ఎడ్యుకేషన్‌‌ను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల ప్యానెల్ (జీవోఎం)కు ధర్మేంద్ర ప్రధాన్ నేతృత్వం వహిస్తున్నారు. ‘డిజిటల్ ఎడ్యుకేషన్ సౌకర్యాన్ని ప్రభుత్వ స్కూళ్లతోపాటు మున్సిపల్ స్కూళ్లకు విస్తరించాల్సిన ఆవశ్యకత ఉంది. ఒక మిషన్‌‌లా వేగవంతంగా ఈ ప్రక్రియను చేపట్టాలి. రూరల్ ఏరియాల్లో విద్యార్థులకు డిజిటల్ ఎడ్యుకేషన్‌‌ను అందుబాటులోకి తీసుకువస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. వాళ్లు త్వరగా ఎన్నో విషయాలు నేర్చుకునే ఆస్కారం ఉంటుంది. విద్యార్థులకు ఎలక్ట్రానిక్ ట్యాబెట్లను ప్రభుత్వమే పంపిణీ చేయాలి’ అని కేంద్రానికి నివేదించిన రిపోర్టులో ప్రధాన్ సూచించారు.