మంత్రి పుట్టిన రోజున టమాటాల పంపిణీ

మంత్రి పుట్టిన రోజున టమాటాల పంపిణీ
  • మంత్రి పుట్టిన రోజున టమాటాల పంపిణీ
  • సూర్యాపేటలో వినూత్నంగా జగదీశ్​రెడ్డి జన్మదిన వేడుకలు

సూర్యాపేట, వెలుగు:  తెలంగాణ విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్​రెడ్డి జన్మదిన వేడుకలను సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆ పార్టీ లీడర్​ వినూత్నంగా జరిపాడు. మంత్రి వీరాభిమాని, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పల్స వెంకన్న గౌడ్  మంగళవారం 100 పేద కుటుంబాలకు 100 కిలోల టమాటాలను పంచి పెట్టారు. ఆయన మాట్లాడుతూ ప్రతి వంటలో టమాటాలు ఎంత ముఖ్యమో...సూర్యాపేట అభివృద్ధిలో మంత్రి జగదీశ్​రెడ్డి పాత్ర కూడా అంతే ముఖ్యమని చెప్పడానికే ఈ ప్రయత్నం చేశానని చెప్పారు.