రైతులు ఖచ్చితంగా విత్తనాల రసీదులు తీసుకోవాలి : గోవిందు

రైతులు ఖచ్చితంగా విత్తనాల రసీదులు  తీసుకోవాలి : గోవిందు

పాపన్నపేట, వెలుగు:  రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసిన షాపు  నుంచి తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలని జిల్లా వ్యవసాయధికారి గోవిందు తెలిపారు. బుధవారం పాపన్నపేట మండలం యూసుఫ్​పేటలో రైతులకు విత్తనాలు, ఎరువుల వాడకంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లూజుగా ఉన్న సంచుల్లో  ఉన్న విత్తనాలను కొనుగోలు చేయవద్దని తెలిపారు. విత్తన ప్యాకెట్, బిల్లును పంటకాలం పూర్తయ్యే వరకు భద్రంగా ఉంచుకోవాలని, వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన అధీకృత డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని అన్నారు. గడువు ముగిసిన విత్తనాలను కొనుగోలు చేయరాదని తెలిపారు.ఈ కార్యక్రమంలో  మండల వ్యవసాయధికారి నాగం కృష్ణ , ఏ ఈ ఓ జనార్ధన్ రైతులు పాల్గొన్నారు