
- జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్
ఆమనగల్లు, వెలుగు: జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్ చెప్పారు. శనివారం కక్షిదారుల సౌకర్యార్థం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన శుద్ధ జలాల వాటర్ ప్లాంట్‌ను, క్యాంటీన్, జిరాక్స్ సెంటర్, ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక న్యాయమూర్తి స్వరూప కాటంతో కలిసి ప్రారంభించారు. అనంతరం కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు. బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన గణపతి విగ్రహానికి ఆయన పూజలు చేశారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ప్రధాన న్యాయమూర్తిని కలిసి ఆమనగల్లులో అదనపు కోర్టు భవన నిర్మాణం, స్థల సేకరణ, అదనపు కోర్టు కేటాయించాలని కోరగా.. తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అసోసియేషన్ అధ్యక్షుడు యాదిలాల్, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, సీనియర్ న్యాయవాది లక్ష్మణ శర్మ, రామకృష్ణ, విజయ్ కుమార్ గౌడ్, కృష్ణ, శేఖర్, మల్లేశ్, జగన్, జమీల్ అహ్మద్,
న్యాయవాదులు పాల్గొన్నారు.