
- జిల్లా విద్యాశాఖ అకడమిక్ మానిటరింగ్ అధికారి నాగరాజ శేఖర్
పాల్వంచ, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆధునిక విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని జిల్లా విద్యాశాఖ అకడమిక్ మానిటరింగ్ అధికారి ఏ. నాగరాజ శేఖర్ అన్నారు. మంగళవారం పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో జిల్లాలోని మ్యాథ్స్, ఫిజిక్స్ టీచర్స్ కు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీచర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఖాన్ అకాడమీ ద్వారా 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆధునిక విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ నాగుల్ మీరా, హరిప్రసా ద్, సంపత్ కుమార్, శంకర్ రావు పాల్గొన్నారు.